ETV Bharat / city

విద్యాకానుక ఇచ్చేదెప్పటికో, 40 రోజులు దాటినా అందని కిట్లు - సీఎం జగన్‌

JAGANANNA VIDYA KANUKA పాఠశాలలు ప్రారంభమైన నెలన్నర రోజులవుతున్నా ఇప్పటికీ అనేక మందికి విద్యాకానుక అందలేదు. మూడు జిల్లాలకు ఇప్పటివరకూ బ్యాగులు సరఫరా చేయలేదు. కొన్నిచోట్ల విద్యాకానుకలోని వస్తువులు పూర్తిస్థాయిలో అందకపోయినా ఇచ్చినట్లుగా చూపిస్తున్నారు.

VIDYA KANUKA
VIDYA KANUKA
author img

By

Published : Aug 22, 2022, 8:39 AM IST

VIDYA KANUKA : పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యా కానుక కిట్లు ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించి దాదాపు 40 రోజులు దాటినా ఇప్పటికీ పంపిణీ పూర్తి కాలేదు. జులై 5న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి విద్యార్థులు ఏకరూప దుస్తులు, బూట్లు లేకుండానే పాఠశాలలకు వస్తున్నారు. ఈనెల 25లోగా పంపిణీ పూర్తి చేయాలని ఇటీవల జరిగిన సమీక్షలో మరోసారి సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ గడువులోగా కూడా విద్యార్థులకు అవి అందే పరిస్థితి కనిపించడం లేదు.

‘‘నిరుడు కంటే ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులు చేరతారని భావిస్తూ దాదాపు 47 లక్షల మందికి కిట్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండగానే పిల్లలు పాఠశాలల్లో అడుగుపెడుతుండగానే విద్యా కానుకను వారి చేతుల్లో పెడుతున్నాం.’’

- కర్నూలు జిల్లా ఆదోనిలో జులై 5న జరిగిన విద్యా కానుక ప్రారంభ సభలో సీఎం జగన్‌

ఏకరూప దుస్తులను కుట్టించుకొని, విద్యార్థులు వాటిని ధరించి వచ్చేందుకు మరో 20రోజుల వరకు సమయం పడుతుంది. మూడు జతలకు కుట్టు కూలి ఇవ్వాల్సి ఉండగా.. ఇంతవరకు ఆ డబ్బులను తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయలేదు. ఇప్పటివరకు ఈ ఏడాది విద్యాకానుకనే అందించని అధికారులు వచ్చే ఏడాదికి సంబంధించిన విద్యాకానుక సామగ్రి టెండర్లకు చర్యలు చేపట్టడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 47,40,421లక్షల మంది విద్యార్థులకు కిట్లు అందించాల్సి ఉండగా.. ఏకరూప దుస్తులు 11.85లక్షలు, బూట్లు 16.59లక్షల మందికి ఇంతవరకు అందలేదు.

బ్యాగ్‌ సైజు చిన్నబోతోంది..

రాష్ట్రంలో శ్రీసత్యసాయి, పల్నాడు, కర్నూలు జిల్లాలకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో బ్యాగ్‌లు సరఫరానే కాలేదు. గుత్తేదారు నుంచి సరఫరా కాలేదని పేర్కొంటూ చాలా మంది పిల్లలకు వాటిని అందించలేదు. ఈ ఏడాది బ్యాగ్‌ సైజుల్లో చిన్నవిగా ఉన్నాయని చాలాచోట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఎక్కువ పుస్తకాలను పెడితే జిప్పులు చెడిపోతున్నాయని పేర్కొంటున్నారు.

* బూట్ల సైజుల్లోనూ కొన్నిచోట్ల గందరగోళం నెలకొంది. పిల్లల పాదాలకు సరిపోయే బూట్లు రాకపోవడంతో వాటిని మార్పు చేసేందుకే ప్రధానోపాధ్యాయులకు ఎక్కువ సమయం పడుతోంది.

* రాష్ట్ర వ్యాప్తంగా బూట్లు 65శాతం, బ్యాగ్‌లు 75శాతమే విద్యార్థులకు అందించారు. ఇంకా దాదాపు 25శాతం మందికి ఇవ్వాల్సి ఉంది.

కుట్టుకూలి లేకుండా ఎలా?

విద్యార్థులకు మూడు జతల ఏకరూప దుస్తులతో పాటు కుట్టు కూలి అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు కుట్టుకూలి మొత్తాలను తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయలేదు. గతేడాది ఇవ్వాల్సిన రూ.62 కోట్లనే ఇటీవల ఇచ్చారు. వస్త్రాలే ఇవ్వడంతో కుట్టుకూలి డబ్బులను తల్లిదండ్రులే భరించాల్సి వస్తోంది.. కొలతల్లో ఏర్పడిన ఇబ్బందుల కారణంగా మూడు జతలకు వస్త్రాలిస్తే రెండు జతలకు మాత్రమే సరిపోతోంది. కొన్నిచోట్ల అమ్మాయిలకు, మరికొన్నిచోట్ల అబ్బాయిలకు ఈ సమస్య ఏర్పడుతోంది. కిట్‌లోని వస్తువులన్నీ రాకపోయినా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వేలిముద్రలు వేయించాలని కొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులపై మండల, జిల్లా విద్యాధికారులు ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిట్లను పంపిణీ చేసినట్లు బయోమెట్రిక్‌ హాజరు తీసుకుంటున్నారు. తమ మండలం లేదా తమ జిల్లా వెనుకబడిందనో పేర్కొంటూ ఉన్నతాధికారులు సామగ్రి ఇచ్చినట్లు బయోమెట్రిక్‌ వేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.