హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీ(National Police Academy)లో దీక్షాంత్ సమారోహ్(Deekshanth Samaroh in Hyderabad) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్(National security advisor Ajit Doval) హాజరయ్యారు. 73వ బ్యాచ్ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.
పరేడ్‌లో అజిత్ డోభాల్(National security advisor Ajit Doval) గౌరవ వందనం స్వీకరించారు. 73వ బ్యాచ్‌లో 149 మంది అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎస్వీపీఎన్ఏలో 132 మంది ఐపీఎస్‌లతో పాటు మరో 17 మంది ఫారెన్ ట్రైనీ ఆఫీసర్లు ఉన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిలో 27 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు.
వరుసగా మూడోసారి పరేడ్ కమాండర్ అవకాశం మహిళా అధికారికే దక్కింది. పంజాబ్ క్యాడర్‌కు చెందిన దర్పణ్ అహ్లువాలియా కమాండింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ బ్యాచ్‌లో రాష్ట్రానికి నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించగా.. ఏపీకి ఐదుగురు ట్రైనీ ఐపీఎస్‌ల కేటాయించారు.