పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. హైకోర్టు ఆదేశాలపై ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఆర్.ఎఫ్.నారీమన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. ఈ కేసు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ధర్మాసనం ముందుకు రాగా... సీజేఐ మరో ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం విదితమే.
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాజధాని పిటిషన్‌లో అమరావతి ఐకాస, రైతులు కేవియట్ దాఖలు చేశారు.
ఇవీ చదవండి: ఇళ్ల పట్టాలకు ఆ స్థలాలొద్దు.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం