ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు.. గాయత్రిదేవిగా అమ్మవారు

author img

By

Published : Sep 28, 2022, 7:31 PM IST

Goddess Gayathri : జగన్మాతకు భక్తులు జేజేలు పలుకుతున్నారు. జైభవానీ అంటూ విజయవాడ ఇంద్రకీలాద్రి మార్మోగేలా నామస్మరణ చేస్తున్నారు. కనకదుర్గమ్మ కరుణించమ్మా అంటూ చిన్నాపెద్దా అంతా భక్తితో వేడుకుంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులు సైతం తమలోని శక్తిని కూడదీసుకుంటూ తమను అనుగ్రహించాలని ఆదుకోవాలని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Goddess Gayathri
గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు

Gayathri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారు మూడు గంటల నుంచి పంచ ముఖాలతో కూడిన వేద మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అన్ని మంత్రాలకు గాయత్రిదేవి మూలశక్తి అయిన అమ్మ.. ముక్తా, విద్రుమ, హేమ, నీల, దవళ వర్ణాలతో ప్రకాశిస్తూ సంధ్యా వనదేవతగా పూజలు అందుకుంటున్నారు- గాయత్రిమాత. దశ హాస్తాలతో ఉన్న అమ్మవారిని దర్శించి గాయత్రీ మంత్రం పఠిస్తే మంత్రసిద్ధి ఫలం లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం.

అమ్మవారిని దర్శనానికి: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావుతోపాటు ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి మురళీధరరెడ్డి, ఇతర రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు ఆలయ సిబ్బంది. అమ్మవారి దర్శనం- అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. గాయత్రీ దేవి రూపంలో అమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరిపైనా అమ్మదీవెనలు ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.

పోలీసుల వైఖరిపై అర్చకుల ఆగ్రహం : దుర్గగుడి అర్చకులు, పండితులను ఆలయంలోకి అనుమతించే విషయంలో కొందరు పోలీసుల తీరు విమర్శలకు తావిచ్చింది. ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకులతోసహా అమ్మవారి అలంకరణ చేసే ముఖ్యమైన పండితులను పోలీసులు అడ్డుకుని వారిపై దురుసుగా మాట్లాడారు. మూడు రోజులుగా పోలీసుల వైఖరి తమను ఆవేదనకు గురిచేసేలా ఉందని పండితులు అసంతృప్తి చెందారు. తమను అవమానిస్తే విధులకు హాజరుకాలేమని తెలిపారు. అమ్మవారి ఉత్సవాల్లో అలంకరణ, ఇతర వైదిక కార్యక్రమాలు, అమ్మవారి భోగాల నివేదన వంటి క్రతువులు సకాలంలో జరగాల్సిందేనని తెలిపారు. ఎక్కడ ఆలస్యమైనా దాని ప్రభావం రోజువారీ దర్శనాలపై పడుతుందని పండితులు పేర్కొన్నారు.

తమ వస్త్రధారణ, తమకు ఇచ్చిన గుర్తింపు కార్డులను చూసి కూడా పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గేట్లకు తాళాలు వేశారంటూ ఈవో, కలెక్టరు పేర్లను ప్రస్తావిస్తూ తమ దైనందిక విధులకు అడ్డుతగులుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఏకవచనంతో మాట్లాడుతున్నారని.. ఆలయంలో ఎటువైపు నుంచి వెళ్లి- ఎటువైపు రావాలన్నా అంతా బారికేడ్లు, తాళాలతో అష్టదిగ్భందనం చేశారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తాము అమ్మవారి సేవల్లో పాల్గొనడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ బాహాటంగానే తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ విషయం తొలుత ఈవో భ్రమరాంబ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

మద్యం సేవించి..: ఆలయంలో ఉత్సవాల రద్దీని పరిశీలించేందుకు వచ్చిన ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరు ఢిల్లీరావుకు.. అర్చకులు తమ సమస్యలు వివరించారు. ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, ఇతర వైదిక కమిటీ ప్రతినిధులతో కలెక్టరు ప్రత్యేకంగా మాట్లాడారు. సమస్య పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వస్త్రధారణ, గుర్తింపు కార్డు చూసి ఎలాంటి అసౌకర్యం లేకుండా వారి విధులు కొనసాగేలా సహకరించాలని పోలీసులకు లిఖితపూర్వకంగా ఆదేశిస్తామని కలెక్టరు తెలిపారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ ఉద్యోగి ఒకరు మద్యం సేవించి విధులకు హాజరుకావడం వివాదాస్పదమైంది. వెంటనే అతన్ని వైద్య పరీక్షల కోసం ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. సెక్యూరిటీ ఏజన్సీపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల నిర్వహణలో అలసత్వంపై సెక్యురిటీ సిబ్బందిని ఈవో గతంలో హెచ్చరించారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ తొలి రెండు రోజుల కంటే పెరిగింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.