ETV Bharat / city

DAMS : ఒక్క అడుగూ పడని కొత్త ప్రాజెక్టులు... ఎక్కడివక్కడే సాగునీటి పథకాలు - 46 సాగునీటి పథకాలు

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ ప్రణాళికలు విస్తృతంగా రూపొందించడం, పాలనామోదం ఇచ్చుకోవడం, టెండర్లు పిలవడం తప్ప అడుగు ముందుకుపడటం లేదు. ఈ కొత్త ప్రాజెక్టులను అయిదు స్పెషల్‌ పర్సస్‌ వెహికల్‌(ఎస్‌పీవీ)గా ఏర్పాటు చేశారు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కొలిక్కి రాలేదు.

ఒక్క అడుగూ పడని కొత్త ప్రాజెక్టులు... ఎక్కడివక్కడే 46 సాగునీటి పథకాలు

author img

By

Published : Oct 25, 2021, 3:36 AM IST

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ ప్రణాళికలు విస్తృతంగా రూపొందించడం, పాలనామోదం ఇచ్చుకోవడం, టెండర్లు పిలవడం తప్ప అడుగు ముందుకుపడటం లేదు. జలవనరుల శాఖ పది సర్కిళ్ల పరిధిలో ఈ రెండున్నరేళ్ల కాలంలో రూపొందించిన 46 సాగునీటి ప్రాజెక్టుల్లో సింహభాగం పనులు జరగడంలేదు. బిల్లులు సకాలంలో ఇచ్చే ఆర్థిక పరిస్థితులు లేకపోవడంతో గుత్తేదారులు ఆసక్తి చూపడంలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కొంతమేర పనులు జరిగాయి. డీపీఆర్‌ రూపొందించేందుకు అవసరమైనవి మినహా అంతకుమించి చేసిందేమీ లేదని ప్రభుత్వమూ పేర్కొంది. అంతర్రాష్ట్ర జలవివాదాల నేపథ్యంలో హరిత ట్రైబ్యునల్‌, ఇతరత్రా కేసులు పెండింగులో ఉండటంతో పనులు జరగడం లేదు. జలవనరుల శాఖ నివేదికలోనే 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులపై పైసా ఖర్చు చేయలేదని స్పష్టంగా లెక్కలు చెప్పింది.

కృష్ణా నదిలో వరద రోజులు తగ్గిపోయాయని, 40 రోజుల వరద కాలంలోనే కరవు ప్రాంతాలకు నీళ్లు మళ్లించి నిల్వ చేసుకునే ప్రణాళికలో భాగంగా సాగునీటి శాఖ వివిధ పథకాలను రూపొందించింది. అందులో రాయలసీమ కరవు నివారణ పథకం ఒకటి. ఈమేరకు రాయలసీమ ఎత్తిపోతలకు టెండర్లు పిలిచారు. సీమ జిల్లాల్లో కాలువల వెడల్పు, కట్టడాల సామర్థ్యం పెంపు వంటి పనులు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ కొత్త ప్రాజెక్టులను అయిదు స్పెషల్‌ పర్సస్‌ వెహికల్‌(ఎస్‌పీవీ)గా ఏర్పాటు చేశారు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కొలిక్కి రాలేదు. 2020 మార్చి నుంచి 2021 జులై వరకు రెండు దశల్లో కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులూ మందగించాయి. దీంతో సాగునీటి ప్రాజెక్టుల పనులు ముందుకు సాగలేదని, నిధులూ వెచ్చించలేకపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు.

ఒక్క అడుగూ పడని కొత్త ప్రాజెక్టులు... ఎక్కడివక్కడే 46 సాగునీటి పథకాలు
ఒక్క అడుగూ పడని కొత్త ప్రాజెక్టులు... ఎక్కడివక్కడే 46 సాగునీటి పథకాలు
  • పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి బనకచర్ల కాంప్లెక్సు వరకు కాల్వల సామర్థ్యం పెంచాలనేది ప్రణాళిక. ఇందుకు రూ.570.45 కోట్లతో పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినా ముందుకుసాగడం లేదు.
  • రాయలసీమ ఎత్తిపోతల పథకంలో రూ.3,825 కోట్లతో టెండర్లు పిలిచారు.
  • కడప జిల్లాలో గాలేరు-నగరి వరద కాలువను అవుకు రిజర్వాయర్‌ నుంచి గండికోట టన్నెల్‌ వరకు వెడల్పు చేసేందుకు రూ.632.88 కోట్లతో పాలనామోదం ఇచ్చారు.
  • గండికోట వద్ద అదనంగా పది వేల క్యూసెక్కులను మళ్లించేలా మరో టన్నెల్‌ తవ్వకానికి రూ.604.80 కోట్లతో పాలనామోదం లభించింది.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.