ETV Bharat / city

ఫేస్​బుక్ అకౌంట్​ హ్యాక్ చేసి రూ.లక్ష దోచేశారు! - ఆర్మీ జవాన్

హైదరాబాద్​లో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఫేస్​బుక్ అకౌంట్​ను హ్యాక్​ చేసిన నిందితులు.. అతని స్నేహితుణ్ని మోసం చేసి లక్ష కాజేశారు. బాధితుడు ఆర్మీ జవాన్.

cyber-criminals-cheated-and-looted-rs-dot-lakh-in-the-name-of-jawan-friend-in-hyderabad

author img

By

Published : May 5, 2020, 12:03 AM IST

ఫేస్​బుక్ అకౌంట్ హ్యాక్​ చేసిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి వద్ద నుంచి లక్ష రూపాయలు దోచేసిన ఘటన హైదరాబాద్​లో జరిగింది. తాను ఇబ్బందుల్లో ఉన్నానని వెంటనే లక్ష రూపాయలు అకౌంట్​లో జమ చేయాలని ఆర్మీ జవాన్ రాములుకి తన స్నేహితుడి ఫేస్​బుక్ అకౌంట్​ నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే ఆ అకౌంట్​కి లక్ష రూపాయలను ఆర్మీ జవాన్ బదిలీ చేశారు. డబ్బులు అకౌంట్​లో వేశానని తన స్నేహితుడికి జవాన్ కాల్ చేసి చెప్పారు. తాను డబ్బులు అడగలేదని రాములుకు స్నేహితుడు బదులిచ్చారు. కంగుతిన్న జవాన్... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో మద్యం విక్రయాల తొలిరోజు ఆదాయమెంతంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.