ETV Bharat / city

Cyber Crime: ఆక్సిజన్‌ పేరిట వేలిముద్రలు సేకరించి..

కరోనా కాలంలో సైబర్ కేటుగాళ్లు నయా మోసాలకు తెర తీస్తున్నారు. బీపీ మానిటర్, పల్స్ ఆక్సిమీటర్ల గురించి ఆన్‌లైన్‌లో శోధిస్తే చాలు వారినే టార్గెట్ చేస్తున్నారు. నకిలీ యాప్‌ లింకులను పంపించి బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆక్సిజన్ శాతం పరీక్షించడానికి లొకేషన్ అవసరమంటూ అన్ని రకాల అనుమతులు తీసుకొని దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.

cheating
cheating
author img

By

Published : Jun 1, 2021, 9:29 PM IST

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఏమాత్రం అనుమానాలున్నా శరీర ఉష్ణోగ్రత, రక్తపోటుతోపాటు రక్తంలో ఆక్సిజన్‌ శాతం ఎంత ఉందో తరచూ పరీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇందుకోసం డిజిటల్‌ థర్మామీటర్, బీపీ మానిటర్, పల్స్‌ ఆక్సిమీటర్ల వినియోగం పెరిగింది. వీటన్నింటి కొనుగోలుకు అధికమొత్తం వెచ్చించాల్సి రావడంతో కొందరు ఆన్‌లైన్‌లో అలా పరీక్షించే యాప్‌లేమైనా ఉన్నాయేమోనని వెదుకుతున్నారు. ఈ పరిస్థితులనే సైబర్‌ నేరస్థులు తమకు అనుకూలంగా మలుచుకొని బురిడీ కొట్టించే ప్రయత్నాలకు తెర లేపారు. నకిలీ యాప్‌లను, లింక్‌లను సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, దిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో పలు ఫిర్యాదులు రావడంతో తెలంగాణ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. మోసగాళ్లు ఎలా వల వేస్తున్నారు? ఆ వలకు చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

మోసాలు జరిగేదిలా..

ఎవరైనా ఇలాంటి యాప్‌ను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తే నేరస్థులు పలు వివరాలను సేకరిస్తున్నారు. ఆక్సిజన్‌ శాతాన్ని పరీక్షించేందుకు అవసరమంటూ లొకేషన్, కెమెరా, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్, ఎస్‌ఎంఎస్, కాల్‌ లాగ్స్, ఫోన్‌లైట్‌ అనుమతులు తీసుకుంటున్నారు.

  • వాటికి అనుమతి ఇచ్చిన క్షణం నుంచి బాధితుడి వ్యక్తిగత వివరాలు సేకరించేందుకు మోసగాళ్లకు అవకాశం లభిస్తోంది.
  • తద్వారా ఫోన్‌లోని ఏకాంత చిత్రాలను సేకరించి, వాటిని మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు.
  • ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ ద్వారా బయోమెట్రిక్‌ తరహాలో ఆధార్‌ సంఖ్యను యాక్సెస్‌ చేసి దుర్వినియోగం చేసేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. బయోమెట్రిక్‌తో అనుసంధానమై ఉండే బ్యాంకు ఖాతాల్లోకి చొరబడుతున్నారు.
  • బ్యాంకు లావాదేవీల సందర్భంగా చరవాణికి వచ్చే ఓటీపీలనూ సంగ్రహించి ఖాతాల్లో నుంచి డబ్బు కొట్టేస్తున్నారు.

యాప్‌ చరిత్ర తెలుసుకుంటే మేలు

  • ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసే సమయంలో సదరు యాప్‌ డెవలపర్, రేటింగ్స్, రివ్యూలు, బగ్స్‌ తదితరాలను పరిశీలించాలి. బాగోలేదని గుర్తిస్తే డౌన్‌లోడ్‌ చేసుకోకూడదు.
  • ఫోన్‌లోని ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ ద్వారా ఆక్సిజన్‌ శాతాన్ని కొలవడం సాధ్యం కాదు. భౌతికంగా పల్స్‌ ఆక్సిమీటర్‌లో వేలు ఉంచితేనే రక్తంలోని ఆక్సిజన్‌ శాతం తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివి నమ్మకూడదు.
  • ఒకవేళ యాప్‌ నకిలీదని గుర్తించకుండా డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పటికీ లొకేషన్, కెమెరా, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్, ఎస్‌ఎంఎస్, కాల్‌ లాగ్స్‌ గురించి అనుమతులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.