ETV Bharat / city

వాట్సాప్​ వీడియో కాల్​ లిఫ్ట్​ చేశారు.. అవతలి వారి ఉచ్చులో చిక్కుకున్నారు..! - whats app video call

Video Call morphing and cheating: సామాజిక మాధ్యమాల వేదికగా అపరిచిత స్నేహాలు గొంతు మీద కత్తిలా మారాయి. మొదట సౌమ్యంగా మాట్లాడి వారు అనుకున్నది సాధించాక ఇక అసలు స్వరూపం బయటపెడుతున్నారు. కొత్తగా వాట్సాప్​ వీడియో కాల్స్​ ద్వారా సైతం సైబర్​ నేరగాళ్లు మోసగాళ్లకు పాల్పడుతున్నారు. వీడియో మార్ఫింగ్​లకు పాల్పడి బాధితులను బెదిరింపులకు గురిచేసి అందినకాడికి దోచుకుంటున్నారు. సినీ పరిశ్రమలో ఉన్న వారు సైతం వీరిలో ఉచ్చులో చిక్కుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఇటీవల వెలుగు చూసిన రెండు ఘటనలు దీనికి ఉదాహరణ.

Video Call morphing and cheating
Video Call morphing and cheating
author img

By

Published : Apr 22, 2022, 1:05 PM IST

Video Call morphing and cheating:సాంకేతికతకు తగ్గట్లుగా నేరాలకు పాల్పడే మార్గాలను సైతం మార్చుకుంటున్నారు దుండగులు. కాదేది నేరం చేయడానికి అనర్హనమన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఘటనే తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో జరిగింది. ఆవివరాలు..

Video Call morphing and cheating: హైదరాబాద్ నగరంలో సైబర్​ నేరాలకు అడ్డుకట్ట వేయడం కష్టతరంగా మారింది. నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను అనుసరిస్తూ అమాయకులను నిలువుదోపిడీ చేస్తున్నారు. అప్రమత్తమై తప్పించుకున్నామా ఆ ఉచ్చు నుంచి బయటపడినట్లే.. పొరపాటున వారి చేతికి చిక్కామో ఇక ఉన్నది మొత్తం ఊడ్చేవరకూ వదిలిపెట్టరు. వారి బెదిరింపులకు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే ఈ సమస్య నుంచి బయటపడతారు. కానీ ఎక్కడ పరువు పోతుందనో భయంతో వెనకడుగు వేస్తున్నారు. వారు అడిగినంతా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక వల్ల కాదని తెలిసి చివరికి పోలీసులను సంప్రదిస్తున్నారు.

వీడియో మార్ఫింగ్​: సంగీత దర్శకుడి చరవాణికి వీడియో పంపి, అనంతరం అతని ముఖాన్ని మరొకరి ముఖంతో మార్ఫింగ్‌ చేసి డబ్బుల కోసం వేధిస్తున్న ఘటన ఇది. హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణానగర్‌లో నివసించే సంగీతదర్శకుడు సరోలి రాజీవ్‌ ఎబ్నేజర్‌కు గతేడాది అక్టోబరు 22న ఫేస్‌బుక్‌ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి పరిచయమై ఫోన్‌ నంబరు తీసుకున్నాడు. అనంతరం సరోలికి ఓ వీడియోకాల్‌ వచ్చింది, అందులో నగ్నంగా ఓ మహిళ ప్రత్యక్షమైంది. అనంతరం అవతలి వ్యక్తి మరొకరి శరీరానికి సరోలి ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి, ఫేస్‌బుక్‌ను హ్యాక్‌ చేశాడు. ఆ వీడియోలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపిస్తానంటూ బెదిరించి డబ్బు డిమాండ్‌ చేశాడు. సరోలి కొంత మొత్తం చెల్లించినా బెదిరింపులు ఆగకపోవడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరో చోట: అపరిచితులు చేసిన వీడియో కాల్‌కు స్పందించడమే ఆ యువకుడిని మానసిక వేదనకు గురిచేసింది. ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం అమీర్​పేట్​లోని ఎల్లారెడ్డిగూడలోని జయప్రకాష్‌నగర్‌కు చెందిన వేమూరి కిరణ్‌(29)కు మంగళవారం వాట్సప్‌ వీడియో కాల్‌ రాగా స్పందించాడు. కాసేపటి తరువాత కాల్‌ కట్​ అయింది. అగంతకులు కిరణ్‌ వీడియో మార్ఫింగ్‌ చేసి అసభ్యంగా చిత్రీకరించారు. తిరిగి ఫోన్‌ చేసి డబ్బులివ్వకుంటే.. ఆ చిత్రాలు సామాజిక మాధ్యమాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించారు. దీంతో బాధితుడు రూ.47వేలు ఫోన్‌పే చేశాడు. మళ్లీ బెదిరిస్తుండటంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.