రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 4 తేదీ వరకూ రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అయితే కర్ఫ్యూ సమయంలో మరో గంట సడలింపు ఇచ్చినట్టు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వుల్లో పేర్కోన్నారు.
రాత్రి 10 గంటలకు బదులుగా 11 గంటల వరకూ సడలింపు సమయాన్ని పెంచినట్టు స్పష్టం చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ వద్ద జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఆదేశాలు జారీచేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. కర్ఫ్యూ అమలు పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం పేర్కోంది. కరోనా పరిస్థితులను అంచనా వేస్తూ రాత్రి పూట కర్ఫ్యూ సమయంలో స్వల్ప మార్పులు చేసినట్టు వెల్లడించారు.
ఇదీ చదవండి: Coronavirus India: దేశంలో 36 వేల కొత్త కేసులు.. 540 మరణాలు