రాష్ట్రంలో కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ఇంటింటా సర్వే నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కలెక్టర్లకు ఆదేశించారు. అనుమానిత లక్షణాలు గల వారి నుంచి నమూనాల సేకరణ, పరీక్షల నిర్వహణ, ఆస్పత్రుల సన్నద్ధత అత్యంత ప్రాధాన్యత అంశాలని స్పష్టం చేశారు. విజయవాడలోని ఆర్ అండ్ బి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో సీఎస్ వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని నాలుగు కోవిడ్ ఆసుపత్రుల్లో అత్యున్నత స్థాయి ప్రమాణాలతో ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచనలు జారీ చేశారు. జిల్లా స్థాయి కోవిడ్ ఆస్పత్రుల్లోనూ ఇదే తరహా ప్రమాణాలు ఉండాలని స్పష్టం చేశారు. క్వారంటైన్ కేంద్రాలలో కూడా కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కంటోన్మెంట్ ఏరియాలో ఏ ఒక్క పాజిటివ్ కేసు ఉండకూడదని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ జోన్లలో సర్వేను అత్యంత కట్టుదిట్టంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి :