ETV Bharat / city

'హ్యాపీనెస్ట్​'కి రివర్స్ ​టెండరింగ్

author img

By

Published : Dec 15, 2019, 6:24 AM IST

Updated : Dec 15, 2019, 6:30 AM IST

రాజధాని ప్రాంతంలో సాధారణ ప్రజలకూ ఆవాసం కల్పించేందుకు రూపకల్పన చేసిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు సీఆర్​డీఏ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించనుంది. ఈ మేరకు రివర్స్ టెండరింగ్ నోటీసు జారీ చేసింది. బిడ్​లు దాఖలు చేసేందుకు ఈ నెల 24 తేదీని తుదిగడువుగా పేర్కొంది. 26న ఈ ప్రక్రియను నిర్వహించి గుత్తేదారును ఖరారు చేయనుంది.

happy nest
హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు

రాజధాని ప్రాంతంలో చేపట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్​డీఏ) రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించింది. దీని కోసం రివర్స్ టెండరింగ్ నోటీసును జారీ చేసింది. బిడ్లు దాఖలు చేసేందుకు ఈ నెల 24 తేదీ వరకు గడువు ఇచ్చింది. 656 కోట్ల రూపాయల మేర పనులను ఇనీషియల్ బెంచ్ మార్క్​గా నిర్దేశించి ఆ మొత్తానికి రివర్స్ టెండర్లను పిలిచింది. గతంలో 658 కోట్ల రూపాయలకు టెండర్లను పిలిచిన సీఆర్డీఏ.. ప్రస్తుతం 2 కోట్ల రూపాయల మేర పనులు పూర్తి కావటంతో మిగిలిన మొత్తానికి రివర్స్ టెండరింగ్ పిలవాలని నిర్ణయించింది.

మొత్తం 12 టవర్లుగా 1200 ఫ్లాట్లు నిర్మించే లక్ష్యంతో రాజధాని ప్రాంతంలోని నేలపాడు వద్ద హ్యపీనెస్ట్ ప్రాజెక్టుకు గతంలో సీఆర్డీఏ శ్రీకారం చుట్టింది. 2018 నవంబరున ఫ్లాట్ల బుకింగ్ ప్రక్రియను కూడా నిర్వహించింది. నేల చదును చేయటం, ఇతర నిర్మాణ పనులు 0.3 శాతం జరిగినట్లు అంచనా. 25శాతం లోపు జరిగిన పనులన్నీ ఆపేయాలన్న వైకాపా ప్రభుత్వ నిర్ణయంతో అవి నిలిచిపోయాయి.

ప్రాజెక్టు వివరాలు

మొత్తం14.3 ఎకరాల్లో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. జీ-18 విధానంలో...12 టవర్లనిర్మాణం ద్వారా సాధారణ ప్రజలకూ అమరావతిలో చోటు కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 1225 చదరపు అడుగుల నుంచి... 2750 చదరపు అడుగుల వరకూ ఫ్లాట్ల విస్తీర్ణం నిర్దేశించారు

ఇదీ చదవండి

'రాజ‌ధానిపై విస్తృత స్థాయి చర్చ జరగాలి'

Intro:Body:

AP_VJA_04_15_HappyNest_Reverse_tendering_pkg_3052784

Conclusion:
Last Updated : Dec 15, 2019, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.