రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో భూసేకరణ కోసం ఇచ్చిన జోవో నెంబర్ 72ను తక్షణం ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. విజయవాడలో మాట్లాడిన ఆయన... చిన్న,పేద,మధ్య తరగతి ప్రజల నుంచి భూములను సేకరించి ఎకరాకు 250 గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. భవిష్యత్‌లో రాజధాని పేరుతో విశాఖలో వేల ఎకరాలు సమీకరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజధాని, మండలి, విశాఖలో భూసమీకరణ వంటి విషయాల్లో జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. 151 సీట్లు వచ్చాయని ఇష్టమొచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కొన్ని పత్రికల్లో రాసినట్లు... కమ్యూనిస్టులకు యూటర్న్ లేదని... విధానపరమైన టర్న్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పూలింగ్‌కు స్వస్తి పలికి 2013 చట్టం ప్రకారం భూ సేకరణ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : 'వివేకా హత్యకేసు విచారణను.. సీఎం సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు'