రాజధానిని ముక్కలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయ్యాయని సీపీఎం నేత బాబూరావు విమర్శించారు. 300వ రోజుకు చేరుకుంటున్న అమరావతి రైతుల ఉద్యమానికి సీపీఎం నేతలు సంఘీభావం తెలిపారు. రాజధాని అమరావతి కోసం సీపీఎం పోరాడుతుందని బాబూరావు స్పష్టం చేశారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని బాబూరావు తెలిపారు.
అమరావతి రాజధాని 29 గ్రామాల రైతుల సమస్య మాత్రమే కాదని, అన్ని జిల్లాల ప్రజల సమస్యని చెప్పారు. ప్రజలకు అందుబాటులో రాజధాని ఉండాలని సీపీఎం కోరుకుంటుందన్నారు. కౌలు చెల్లించకుండా, ఫించన్లు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధిస్తుందని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులపై మొండిగా ముందుకు వెళ్తుందన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదన్నారు. రాజధానులపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.
ఇదీ చదవండి: