రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు డబ్బులెందుకు చెల్లించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈ నెల 9న విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీలు, రోడ్ల దుస్థితి, పింఛన్ల రద్దుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
పెట్రో ధరల నియంత్రణలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్న రామకృష్ణ... విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు పాదయాత్ర చేస్తామని వెల్లడించారు. ఈనెల 14న అనంతపురంలో ప్రారంభించి విశాఖలో ఈ పాద యాత్రను పూర్తిచేస్తామన్నారు. పాదయాత్ర చివరి రోజైన 21వ తేదీన విశాఖ ఉక్కుపై బహిరంగసభ నిర్వహిస్తామని సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు.
ఇదీ చూడండి: RAINS : రాష్ట్రంలో పొంగిపొర్లిన వాగులు, వంకలు... నేడు, రేపు భారీవర్షాలు