రాజధాని రైతులకు వ్యతిరేకంగా వాదించటానికి రూ.5 కోట్లు ఖర్చు పెట్టేవారు రైతు ప్రక్షపాతి ఎలా అవుతారని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా... అమరావతి అభివృద్ధికి రూ.5 కోట్లు వెచ్చించలేదని పేర్కొన్నారు. ప్రజాధనాన్ని లాయర్ ఫీజు కింద చెల్లించటం దుర్మార్గమని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతు వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయమన్నారు. తన కేసులు వాదించే లాయర్నే... ఈ కేసులు వాదించేందుకు పెట్టుకోవడం వెనక క్విడ్ప్రోకో ఏమైనా ఉందా..? అని నిలదీశారు. న్యాయవాది ముకుల్ రోహత్గి నైతిక విలువలు ఉంటే ఫీజు కింద తీసుకున్న ప్రజాధనాన్ని తిరిగి ఇవ్వాలన్నారు.
'సీఎం జగన్... రైతు వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోతారు' - cpi ramakrishna latest news
అమరావతి రైతులకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించటానికి రూ.5 కోట్లు వెచ్చించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. లాయర్ రుసుముపై కొత్త జీవోను తీసుకొచ్చి ప్రజాధనాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.