ఈ పార్లమెంటు సమావేశాల్లోనైనా రాష్ట్రానికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విజయవాడలో అన్నారు. ప్రభుత్వ భూములను అమ్మాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామంతో ప్రభుత్వం దివాళా తీసినట్టు పరోక్షంగా అంగీకరించినట్టే అన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వ భూములు అమ్మాలని చూడడం మంచిది కాదని చెప్పారు. ఈ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడతాని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి: