ముఖ్యమంత్రి జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. కరోనా కారణంగా రాష్ట్రం పలు ఇబ్బందులను ఎదుర్కొంటోందని..నిధుల కొరతతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. సరైన సమయంలో దిల్లీ వెళ్లి హోంమంత్రిని కలుస్తున్న జగన్...ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం డిమాండ్ చేయాలని సూచించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: