తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం ఘటనపై సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి... మంత్రి పినిపె విశ్వరూప్ అనుచిత వ్యాఖ్యలు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఇప్పటి వరకూ ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయకుండా ప్రభుత్వం దోబూచులాడుతోందని విమర్శించారు.
"మనోవేదనతో శిరోముండనం యువకుడు నక్సలైటుగా మారతానని రాష్ట్రపతి కి లేఖ రాస్తే... మంత్రి స్థానంలో ఉన్న విశ్వరూప్ బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేయడం దారుణం. డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసులపై చర్యలు తీసుకున్నారు. కానీ.. ఘటనకు బాధ్యులైన వైకాపా నేతలను ఎందుకు అరెస్టు చేయలేదు?"
- రామకృష్ణ, సీపీఐ నేత
శుక్రవారం తమ బృందం రాజమహేంద్రవరంలో పర్యటిస్తుందని తెలిపారు. దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయిలో పోరాడతామని రామకృష్ణ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: