బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తిందని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. ప్రభుత్వ భూములను ఈ-వేలం ద్వారా విక్రయించాలనుకోవడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటే భావితరాల ప్రయోజనాలకు ఏమీ మిగలదన్నారు. విక్రయించాలన్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టాలని సూచించారు.
ఇదీ చదవండి :