హిందుత్వాన్ని పక్కన పెట్టేందుకే విశాఖ ఉక్కు ఉద్యమం తెరమీదకు తీసుకొచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటపై సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు అవివేకమని... అబద్ధాలకు చిరునామాగా వీర్రాజు నిలుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. దిల్లీలో సోము వీర్రాజుకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని.. వారి చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ప్రధాని అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశం జరిగిన విషయం వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. ఆ సమావేశంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నూరు శాతం ప్రైవేటుపరం చేయాలని నిర్ణయం తీసుకున్నారని రామకృష్ణ గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై భాజపా కుట్రలను ప్రజలు క్షమించబోరని అన్నారు.
ఇదీ చదవండి: