ETV Bharat / city

కరోనా ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సీపీఐ రామకృష్ణ - CPI Ramakrishna Latest News

తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులను చూసైనా సీఎం జగన్ కరోనాపై అఖిలపక్ష సమావేశం నిర్వహించరా..? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైద్యం కోసం చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో జిల్లాస్థాయి అధికారికి పడక దొరక్కపోవడంతో మరణించారని గుర్తుచేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
author img

By

Published : May 18, 2021, 9:49 PM IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైద్యం కోసం చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. కరోనా వ్యాప్తి రోజురోజుకూ అధికమవుతోందని... రాష్ట్రంలో నిత్యం 20 వేల నుంచి 25 వేల మధ్య కరోనా పాజిటివ్‌లు నిర్ధారణ అవుతున్నాయని.. మరణాలు వందకు చేరుగా ఉంటున్నా.. ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్కసారి కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదని విమర్శించారు. తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులను చూసైనా సీఎం జగన్ కరోనాపై అఖిలపక్ష సమావేశం నిర్వహించరా..? అని ప్రశ్నించారు.

విజయనగరం, కర్నూలు, హిందుపురం, కదిరి, అమలాపురం, తిరుపతిలలో ఆక్సిజన్‌ అందక 76 మంది రోగులు మరణించిన ఘటనలు హృదయ విదారకరమని రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్ల కొరత కారణంగా మెరుగైన వైద్యం అందకపోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమా పలువురు రోగులు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2229 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతోందని... కేవలం 1,117 కోట్లు ఔషదాలు, మందుల కొనుగోలుకు వెచ్చించినట్లు చెబుతున్నారని... అంత డబ్బులు ఖర్చు చేసి రాష్ట్రంలో ఎక్కడైనా శాశ్వత వైద్య సదుపాయాలు నెలకొల్పారా..? అని ప్రశ్నించారు. అనంతపురంలో జిల్లాస్థాయి అధికారికి పడక దొరక్కపోవడంతో మరణించారని గుర్తుచేశారు. పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌, కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటు.. నిర్వహణ, ఔషదాల కొనుగోలు, బాధితులకు ఆహారం తదితరాలకు ఎన్నెన్ని నిధులు కేటాయించారో? ఎంత ఖర్చు చేశారో పూర్తి వివరాలతో శ్వేతప్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 21,320 కరోనా కేసులు, 99 మరణాలు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.