తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పోటీ చేయకుండా పవన్ కల్యాణ్ తెలివిగా వ్యవహరించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ ఉప ఎన్నికలో జనసేన పక్కకు జరిగి.. భాజపాను ఊబిలోకి నెట్టిందన్నారు.
భాజపా పోటీ చేయడం వల్ల ప్రజా తీర్పునకు అవకాశం ఏర్పడిందన్న రామకృష్ణ... ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీ నేతలు ఓట్లు అడగుతారని నిలదీశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నందుకా, తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ నెరవేర్చనందుకా, విభజన చట్ట హామీలు అమలు చేయనందుకా, ఏపీకి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించనందుకా అని రామకృష్ణ ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
ప్రైవేటీకరణ వద్దంటూ.. ప్రత్యేక హోదా కోరుతూ.. దిల్లీలో ఏపీ కాంగ్రెస్ నిరసన