ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు మోపే విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటనలు జరపాలని సీపీఎం కార్యవర్గ సమావేశం నిర్ణయించిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జనవరి 21వ తేదీన చేపట్టిన సదస్సుకు తెదేపా, వైకాపా, జనసేనలు మద్దతు తెలపాలని కోరుతున్నామన్నారు. కరోనా సమయంలో పన్నుల పెంపు, పెట్రోల్, సిమెంట్ , ఐరన్ వంటి వాటి పై ధరలు పెంచడంతో ఉపాధి కోల్పోయి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. వైకాపా ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే చర్యలు వెనక్కి తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేస్తోందన్నారు.
ఇదీ చదవండి: ఈనెల 22న ప్రకాశం జిల్లాకు పవన్ కల్యాణ్