ప్రజాసమస్యల పరిష్కారం కోసం మే 4న రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో మౌనదీక్షలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. లాక్డౌన్తో పేదలు, కూలీలు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదలకు సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే లాక్డౌన్ వల్ల నష్టపోయిన రైతులు, చిరువ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాలన్న ఆయన.. ప్రతి పేద కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం, 50 కిలోల బియ్యం, 50 కిలోల గోధుమలు అందించాలని కోరారు.
ఇదీ చూడండి..