ETV Bharat / city

క్వారంటైన్​లో సమస్యలు...రోగులకు తప్పని తిప్పలు - ఏపీ కొవిడ్ కేసుల సంఖ్య

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. వందల్లో వచ్చే కేసులు కాస్త వేలల్లోకి చేరాయి. అయితే కేసులతో పాటే.. సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అధికారుల పాపమో.. సమన్వయలోపమో తెలియదు కానీ.. చాలా చోట్ల రోగులు అవస్తలు పడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. క్వారంటైన్లకు చేర్చడంలో నిర్లక్ష్యం.. ఆ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడంలో నిర్లిప్తత వంటి ఘటనలు చూస్తే..అది నిజం అనిపించక మానదు.

క్వారంటైన్​లో సమస్యలు... రోడ్లమీద రోగులు

author img

By

Published : Jul 24, 2020, 9:53 PM IST

Updated : Jul 24, 2020, 10:01 PM IST

కరోనా రోగులకు తిప్పలు

అర్థరాత్రి వరకూ కోవిడ్ రోగులను అటవీప్రాంతంలో వదిలేయడం... క్వారంటైన్ సెంటర్ల వద్ద కరోనా రోగులు పడిగాపులు పడటం... అంబులెన్సుల్లో... ఆర్టీసీ బస్సుల్లో పాజిటివ్ వ్యక్తులను కుక్కి కుక్కి తరలించడం.. క్వారంటైన్ సెంటర్లలో భోజనాలు కూడా పెట్టడం లేదని ఆందోళనలు.. ఈ రెండు మూడు రోజుల్లోనే రాష్ట్రంలో జరిగిన సంఘటనలు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. క్వారంటైన్ కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవంటూ ఆరోపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమే అనిపించక మానదు.

బస్సుల్లో కుక్కి కుక్కి తరలింపు

కరోనా పరీక్షల అనంతం పాజిటివ్ వచ్చిన బాధితుల్ని, అనుమానితుల్ని... బస్సుల్లో సమీప క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇలా తరలిస్తున్నప్పుడు కొన్నిచోట్ల నిబంధనలు పాటించకుండా వ్యాధి వ్యాప్తికి కారకులవుతున్నారు. కర్నూలు, విశాఖలో ఘటనలే ఇందుకు నిదర్శనం. కరోనా అనిమానితుల్ని అంబులెన్స్ లు, బస్సుల్లో కుక్కి కుక్కి ఎక్కించి తీసుకెళ్లిన ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. క్వారంటైన్ కేంద్రాలకు తీసుకెళ్తున్నప్పుడు సైతం బాధితుల వ్యాధి తీవ్రతను అంచనా వేయకుండా తరలించడం కూడా మరో ప్రమాదానికి కారణమవుతోంది. వ్యాధి తీవ్రంగా ఉన్న వృద్ధులు బస్సుల్లోనే మరణించిన సంఘటనలు ఇటీవల జరిగాయి.

అర్ధరాత్రి వరకు పడిగాపులు

తీరా క్వారంటైన్ కేంద్రాలకు బాధితుల్ని తరలించినా... బెడ్లు లేవని, గదులు ఖాళీ లేవని అర్థరాత్రులు రోడ్లపై వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. తాడేపల్లిగూడెం, ఏలూరు, గుంటూరులలో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. తాడేపల్లిగూడెంలో కోవిడ్ రోగులు దాదాపు ఐదు గంటలు బస్సుల్లోనే నిరీక్షించారు. వీరికి అర్థరాత్రి వరకూ కనీసం తిండికూడా పెట్టలేదు. చివరికి క్వారంటైన్ కేంద్రంలో స్థానం దక్కినా... కరోనాను ఎదుర్కొనే బలవర్థకమైన తిండి అందించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత, రాత్రి 10 గంటల తర్వాత భోజనాలు పెడుతున్నారని బాధితుల నుంచి వినిపిస్తున్న ఆరోపణలు.

రెండు రోజులకే ఇంటికి!

కేసులు ఉద్ధృతి పెరిగాక క్వారంటైన్ సెంటర్లలో కూడా పరిస్థితులు మారిపోయాయి. ఇంతకుముందు కనీసం పదిరోజుల వరకూ వారిని అక్కడ ఉంచేవారు. ఇప్పుడు కొన్నిచోట్ల రెండు రోజులు కూడా ఉంచడం లేదు. కొంతమందికి లక్షణాలు కల్పించిన పదిరోజుల వరకూ పరీక్షలు నిర్వహించలేదు. తీరా కరోనా తగ్గిపోయే దశలో తీసుకొచ్చి క్వారంటైన్ చేస్తున్నారని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోనీ అక్కడకు వెళ్లాక కూడా వెంటనే పరీక్షలు నిర్వహించడం లేదు. కొంతమందిని పరీక్షలు చేయకుండానే వెళ్లిపోవాలని చెబుతున్నారన్న ఆరోపణలున్నాయి. కనీసం పరీక్ష కూడా చేయకుండా, నెగిటివ్ వచ్చిందో లేదో తెలుసుకోకుండా ఇంటికి పంపించేస్తున్నారని వాపోతున్నారు. ఇంటికి పంపే సమయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కుటుంబసభ్యులకు తెలపకుండా, ప్రయాణ ఖర్చులకు చేతిలో డబ్బులు పెట్టి పంపేస్తున్నారన్న ఆరోపణలు విధితమే. ఒకవేళ కరోనా తగ్గకుండా ఇలా ఇంటికి పయనమౌతున్న వారు.. వాహకాలుగా మారి మరెంతమందికో వ్యాధిని వ్యాపింపజేసే ప్రమాదం ఉందన్న వాస్తవాన్ని విస్మరించలేం. కేవలం రెండు రోజులు ఉంచడానికి ఇలా ప్రయాసపడి తీసుకురావడం ఎందుకు..? ఊరిలోనే ఎఎన్ఎమ్ ఆ విటమిన్ ట్యాబెట్లు ఇచ్చేస్తే చాలు కదా అన్నది కొందరి వాదన. దీనివల్ల కనీసం కరోనా వ్యాప్తి కొంతలో కొంతైనా తగ్గుతుందని అంటున్నారు.

ఇదీ చదవండి:

రాజధాని బిల్లులపై న్యాయ సలహా తీసుకుంటున్న గవర్నర్

Last Updated : Jul 24, 2020, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.