ETV Bharat / city

గ్రామాల్లోనూ.. కొవిడ్‌ మినీ సంరక్షణ కేంద్రాలు..! - mini covid care centers at villages

గ్రామాల్లోనూ కొవిడ్‌ మినీ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. కరోనా నిర్ధరణకు ఆర్టీపీసీఆర్‌ ద్వారా పరీక్షించే బాధ్యత పీహెచ్‌సీ డాక్టర్‌ కు అప్పగించారు. గిరిజన ప్రాంతాలకు సైతం ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

mini covid centers at village level
గ్రామాల్లోనూ కొవిడ్‌ మినీ సంరక్షణ కేంద్రాలు
author img

By

Published : May 20, 2021, 11:48 AM IST

గ్రామాల్లోనూ కొవిడ్‌ మినీ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. కరోనా బాధితులు ఇళ్లల్లో విడిగా ఉండేందుకు సౌకర్యం లేనిపక్షంలో అలాంటి వారిని ఈ కేంద్రాల్లో ఉంచాలని పేర్కొన్నారు. ఈ కేంద్రాల్లో అవసరమైన మందులు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు కూడా అందుబాటులో ఉంచాలని తెలిపారు.

ఈ కేంద్రాల్లో ఉండే బాధితుల ఆరోగ్య పరిస్థితిని స్థానిక పీహెచ్‌సీ వైద్యులు, ఆశా, ఏఎన్‌ఎంలూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలన్నారు. సచివాలయాలకు అనుబంధంగా ఓ వాహనాన్ని అద్దెపై సమకూర్చుకొని అవసరమైన సందర్భాల్లో బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించవచ్చని తెలిపారు. పీహెచ్‌సీ పరిధిలో అనుమానిత లక్షణాలు కలిగిన వారు ఉంటే.. నమూనాలు సేకరించి ఆర్టీపీసీఆర్‌ ద్వారా పరీక్షించే బాధ్యత పీహెచ్‌సీ డాక్టర్‌పై ఉంటుందన్నారు.

ముఖ్యాంశాలు!

  • కొవిడ్‌ పరిస్థితులు ప్రతిరోజూ సమీక్షించేందుకు సర్పంచి ఛైర్మన్‌గా ఏఎన్‌ఎం కన్వీనర్‌గా కమిటీ ఏర్పాటుచేయాలి. ఇందులో ఆశా, గ్రామ వాలంటీర్‌, మరో ఇద్దరిని సభ్యులుగా నియమించాలి. కొవిడ్‌-19 మార్గదర్శకాలపై అవగాహన కల్పించాలి.
  • కొవిడ్‌ లక్షణాలు కలిగిన వారిలో 80% నుంచి 85% మంది ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఉండదు. ఇంటి వద్దనే ఉండి చికిత్స పొందొచ్చు. మందుల కిట్‌లను అందచేయాలి. వీరి నుంచి సేకరించిన నమూనాలను ర్యాపిడ్‌ యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు పంపాలి. ఏఎన్‌ఎంలు యాంటీజెన్‌ పరీక్షలు చేయాలి.
  • క్రమం తప్పకుండా ఇంటింటి సర్వే ద్వారా అనుమానిత లక్షణాలు కల వారిని గుర్తించి పరీక్షకు జరపాలి. ఉప ఆరోగ్య కేంద్రాల్లో గంటసేపు ఓపీ నిర్వహించాలి.
  • లక్షణాలు లేకుండా ఉంటే ఇళ్లల్లో ఏకాంతంగా ఉండే వారిని పదిరోజుల అనంతరం డిశ్ఛార్జి చేయాలి. అయితే వారు 14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలి. ఇలాంటి వారి నుంచి నమూనాలు సేకరించాల్సిన అవసరంలేదు.
  • ఆక్సిజన్‌ స్థాయి 94 కంటే తగ్గినట్లైతే బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
  • ఈ ఉత్తర్వులు గిరిజన ప్రాంతాలకు కూడా వర్తిస్తాయని సింఘాల్‌ వెల్లడించారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆక్సిజన్‌ కోటాలో కోత..

రాష్ట్రానికి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి వచ్చే ఆక్సిజన్‌ కోటా తగ్గబోతుందని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. మంగళగిరిలోని బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రిజర్వు నిల్వలు అయిపోవడం, ప్లాంట్‌ అంతర్గత అవసరాల దృష్ట్యా ఇకపై 170 మెట్రిక్‌ టన్నులకు బదులు 130 టన్నులు మాత్రమే రాష్ట్రానికి అందబోతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇతరచోట్ల నుంచి అదనంగా పొందేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆసుపత్రుల్లో పడకల కోసం వచ్చే ఫోన్‌ కాల్స్‌ క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల కచ్చితమైన సంఖ్యను గురువారం వెల్లడిస్తామన్నారు. దీని చికిత్స కోసం 1,650 'యాంపోటెరిసిన్‌-బి' ఇంజక్షను సమకూరుస్తున్నామని వివరించారు.

ఇవీ చదవండి:

దిల్లీలో 70ఏళ్ల కనిష్ఠానికి మే నెల ఉష్ణోగ్రతలు

కరోనా సోకిందా.. కంగారుపడొద్దు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.