ETV Bharat / city

రాష్ట్రంలో మరో 368 మందికి కరోనా పాజిటివ్ - 21.03.20221 ఏపీలో కరోనా కేసులు

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 368 మందికి కొవిడ్ సోకింది. అత్యధికంగా గుంటూరులో 79, అత్యల్పంగా ప్రకాశంలో ఆరుగురికి వైరస్ నిర్ధరణ అయింది. 263 మంది కోలుకోగా.. ఎవరూ మరణించలేదని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా లెక్కలతో కలిపి ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,93,734కి చేరింది.

ap covid cases on 21.03.2021
మార్చి 21న ఏపీలో కరోనా కేసులు
author img

By

Published : Mar 21, 2021, 6:25 PM IST

రాష్ట్రంలో గత 24 గంటల్లో 31,138 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 368 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 79, అత్యల్పంగా ప్రకాశంలో ఆరుగురికి వైరస్ సోకినట్లు పేర్కొంది. కర్నూలు 49, అనంతపురం చిత్తూరులో 40, విశాఖపట్నం 39, కృష్ణా 37, తూర్పుగోదావరి నెల్లూరులో 20, కడప శ్రీకాకుళంలో 10, పశ్చిమగోదావరి విజయనగరంలో 9 మందికి చొప్పున కొవిడ్ నిర్ధరణ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

263 మంది కోలుకోగా.. మహమ్మారి వల్ల ఎవరూ మరణించలేదని తెలిపింది. తాజా గణాంకాలతో కలిపి.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,93,734 మందికి కొవిడ్ సోకింది. వారిలో 8,84,357 మంది కోలుకున్నారు. మరో 2,188 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 7,189 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి:

ఉప్పు సత్యాగ్రహం స్ఫూర్తితో 'ఉక్కు సత్యాగ్రహం' చిత్ర నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.