ETV Bharat / city

కొవిడ్ దూకుడు తగ్గేదెన్నడు..?

author img

By

Published : Sep 2, 2020, 11:39 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రారంభంలో కాస్త ధీమాగా కనిపించినా ... ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతున్నట్టుగా కనిపిస్తోంది. గత నెల రోజుల్లో 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయంటే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. పరీక్షలు విస్తృతంగా నిర్వహించేందుకు ప్రాధాన్యతనివ్వడంతో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ.. నేటికీ అవసరమైన వారికి, ప్రైమరీ కాంటాక్టులకి సకాలంలో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఉంది. దేశంలో మరే రాష్ట్రంలోనే ఇంత వేగంగా కేసులు పెరగటం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,55,531 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 4,125 మంది మృతి చెందారు. 3,48,330 మంది బాధితులు కోలుకున్నారు. 1,03,076 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 38,43,550 కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో కరోనా కేసుల ప్రవాహంలో.. రాష్ట్రం రెండవ స్థానంలోకి వచ్చి చేరింది.

Covid-19 cases hike in Andhra Pradesh
కొవిడ్ దూకుడు తగ్గేదెన్నడు..?

రాష్ట్రంలో గత నెల 22 వరకు మొత్తం కేసుల సంఖ్య 3,45,216 ఉండగా... ఈ 12 రోజుల్లో దాదాపు ప్రతిరోజూ 10 వేలకు పైగానే కొవిడ్ బాధితులు పెరిగారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు లక్షా 10వేల 315 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మార్చి 10వ తేదీ నాటికి ఒక్క కేసూ నమోదు కాలేదు. తొలి కేసు మార్చి 12న నెల్లూరు జిల్లాలో నమోదయ్యింది. ఆ తర్వాత ఏప్రిల్ 10 నాటికి 381కి కేసులు పెరిగాయి. వాటిలో అత్యధికం దిల్లీలోని ఓ సమావేశానికి హాజరయిన వారివే. మే 10 నాటికి ఆ కేసులు 1,910కి పెరిగాయి. దాదాపుగా మూడు రెట్ల వరకూ కొత్త కేసులు వచ్చాయి. ఈ సమయంలో తమిళనాడు కోయంబేడు మార్కెట్ కారణంగా వచ్చిన కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

ఒకే నెలలో ఆరు రెట్లు...

జూన్ 10 నాటికి కేసుల సంఖ్య 4,126కి పెరిగింది. అంటే దాదాపు రెట్టింపు అయ్యాయి. ఆ తర్వాత లాక్‌డౌన్ సడలింపులు ఏపీలో కేసులు వేగంగా పెరగడానికి ప్రధాన కారణం అయ్యింది. ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన వారితో కేసులు అమాంతంగా పెరగడం ప్రారంభమయ్యింది. జులై 10 నాటికి ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24,422కి చేరింది. అంటే ఒకే నెలలో ఆరు రెట్లు కేసులు పెరిగాయి.

నెల రోజుల్లో 2 లక్షలకు పైగా కేసులు

గడిచిన నెల రోజులు గమనిస్తే లాక్‌డౌన్‌కి మరిన్ని సడలింపులు తోడైన కారణంగా కరోనా విస్తృతి భారీగా కనిపిస్తోంది. ప్రస్తుతం కేసులు రెట్టింపు కావడానికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే తీసుకుంటుందంటే పరిస్థితి అర్థమవుతోంది. దేశంలో మరే రాష్ట్రంలోనే ఇంత వేగంగా కేసులు పెరగటం లేదు. ఆగస్టు 10 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 2,35,525కి చేరింది. అంటే జులై 10 తర్వాత నెల రోజుల్లోనే 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నిత్యం దాదాపు 10,000 కేసులు కొత్తవి కనిపిస్తున్నాయి. కరోనా ఎంత వేగంగా విస్తరిస్తోందనే విషయం ఈ అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

మరణాల్లో ఐదో స్థానం

దేశవ్యాప్తంగా నాలుగు వేలకుపైగా మరణాలు సంభవించిన ఐదో రాష్ట్రంగా ఏపీ రికార్డు నెలకొల్పింది. 24 వేల మరణాలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా.. తమిళనాడు (7,322), కర్ణాటక (5,702), దిల్లీ (4,444) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో మరణాలు ఇదే స్థాయిలో నమోదైతే.. మరో రెండు మూడు రోజుల్లో దిల్లీని దాటేసి నాలుగో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిరోజూ 80 నుంచి 90 మరణాలు సంభవిస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 59,834 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,368 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. బుధవారం బులిటెన్​లో 10,392 మందికి పాజిటివ్ వచ్చింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4,55,531కి చేరింది.

ఆ రెండు జిల్లాల్లోనే అధికం..!

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈ ఒక్క జిల్లాలోనే 60 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారంతో కలిపి తూర్పుగోదావరిలో ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 61,810 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే కర్నూలులోనూ కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. కర్నూలు జిల్లాలో 46,255 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి, కర్నూలు ఈ రెండు జిల్లాల్లో కలిపి లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

ఏపీ: మరో 10, 392 మందికి కరోనా... 4,55,531కు పెరిగిన బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.