ETV Bharat / city

COVAXIN: పూర్తి స్థాయి అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని యూఎస్​ఎఫ్​డీఏ సూచన - తెలంగాణ వార్తలు

కొవాగ్జిన్ పూర్తి స్థాయి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా యూఎస్​ఎఫ్​డీఏ సూచించిందని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. అందుకు మరింత సమచారం అవసరమవుతుందని పేర్కొంది. ఈ విషయాన్ని తమ భాగస్వామి ఆక్యుజెన్ సంస్థకు సూచించినట్లు పేర్కొంది.

covaxin-usage-in-america-with-ocugen-pharma
COVAXIN: పూర్తి స్థాయి అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని యూఎస్​ఎఫ్​డీఏ సూచన
author img

By

Published : Jun 11, 2021, 6:22 PM IST

అమెరికాలో హెర్డ్ ఇమ్యూనిటీ, ఎక్కువమందికి వ్యాక్సినేషన్ వల్ల కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టిందని… ఇక నుంచి ఏ కొత్త వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వరాదని యూఎస్​ఎఫ్​డీఏ నిర్ణయించినట్లు భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. తాము అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​ను పూర్తి స్థాయి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తమ భాగస్వామి ఆక్యుజెన్​కు సూచించిందని వెల్లడించింది. టీకాల అనుమతికి పూర్తిస్థాయి లైసెన్స్‌ ప్రక్రియ అయిన బయోలాజికల్‌ లైసెన్స్‌ అప్లికేషన్‌- బీఎల్​ఏ మార్గాన్ని అనుసరించాలని సూచించినట్లు పేర్కొంది. అందుకు అదనపు క్లినికల్ ట్రయల్స్ డేటా అవసరమవుతుందని వివరించింది. దానికి మరికొంత సమయం పడుతుందని తెలిపింది.

కొవాగ్జిన్​కు ఇప్పటి వరకూ 14 దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతులు లభించినట్లు తెలిపిన భారత్ బయోటెక్ మరో 50 దేశాల్లో ఆ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. భారత్​లో తయారైన లేదా ఉత్పత్తయిన టీకాకు యూఎస్​ఎఫ్​డీఏ నుంచి అత్యవసర వినియోగానికి గానీ లేదా పూర్తి స్థాయి లైసెన్స్ కానీ రాలేదని స్పష్టం చేసింది. కొవాగ్జిన్​కు యూఎస్​ఎఫ్​డీఏ అనుమతి వస్తే భారత్​లో టీకా ఆవిష్కరణ, తయారీకి అది గొప్ప ముందడుగు అవుతుందని వెల్లడించింది.

ఇదీచదవండి

MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.