Bhadradri Temple Hundi Counting: తెలంగాణ భద్రాద్రి ఆలయంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం భక్తుల సమక్షంలో జరిగింది. ప్రధాన ఆలయంలో ఉన్న హుండీతో పాటుగా ఉప ఆలయాల్లో ఉన్న మొత్తం 36 హుండీలను లెక్కింపు చేశారు. లెక్కింపులో ఈరోజు భక్తులు స్వామి వారికి సమర్పించిన నగదు 86 లక్షల 2వేల 27 రూపాయలు వచ్చాయని ఆలయ ఈఓ శివాజీ తెలిపారు. అంతే కాకుండా బంగారం 90గ్రాములు, వెండి 1,100 గ్రాములతో పాటు ఇతర దేశాల కరెన్సీ కూడా భక్తులు కానుకలుగా ఇచ్చారని ఆయన తెలిపారు.
ఆలయంలోని చిత్రకూట మండపం వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. చివరి సారిగా జులై నెలలో హుండీ లెక్కింపు చేయగా 70 రోజులు తర్వాత మరలా లెక్కించారు. గత నెలలో భద్రాద్రికి వరదలు రావడం భక్తులు సంఖ్య తగ్గడంతో ఈసారి కానుకలు కాస్త తగ్గాయని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.
ఇవీ చదవండి: