ETV Bharat / city

తెలంగాణలో ఆ జిల్లాలో కేసులకు తేదీలతో సంబంధమిలా..!

కొవిడ్-19 కేసులతో... తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హడలెత్తిపోతోంది. గురువారం ఒక్కరోజే 16 కేసులు బయటపడటం... సంచలనంగా మారింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 39 పాజిటివ్ కేసులు నమోదు కాగా... తాజా వాటితో మూడు కంటైన్​మెంట్ జోన్లు ఏర్పాటవుతున్నాయి. అటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా... కేసుల సంఖ్య 51కి చేరుకుంది. ఈ కేసులకు తేదీలతో సంబంధం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

coronavirus-positive-cases-in-nalgonda-and-suryapet-district
తెలంగాణలోని సూర్యాపేటలో కరోనా కేసులు
author img

By

Published : Apr 18, 2020, 9:23 AM IST

వరుసగా బయటపడుతున్న కరోనా కేసులతో... తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కలవరం మొదలైంది. నిర్ధరణ అయిన కేసులతో జిల్లా కేంద్రం హడలెత్తిపోతుంటే... కొత్తవి వచ్చిపడుతున్నాయి. గురువారం ఒక్కరోజే 16 కేసులు నమోదవడం... సంచలనానికి కారణమైంది. ఇప్పటికే 23 వెలుగు చూడగా... తాజా వాటితో మొత్తం సంఖ్య 39కి చేరుకుంది. సూర్యాపేట పట్టణంలోనే 28 నమోదవటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తుండగా... 39 కేసుల్లో ముగ్గురు పిల్లలున్నారు.

16వ తేదీన 16 మందికి

గత శనివారం 11 కేసులు నమోదవగా... ఆ రికార్డును అధిగమిస్తూ గురువారం ఏకంగా 16 మందిలో పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. అందులో జిల్లా కేంద్రానికి సంబంధించి 14 మందితోపాటు... తిరుమలగిరిలో ఒకరు, ఆత్మకూరు(ఎస్) మండలానికి చెందిన ఆరేళ్ల బాలుడు ఉన్నారు. కొత్తగూడెం బజారుకు చెందిన వ్యక్తి వల్ల ఆయన కూతురు ఇప్పటికే వ్యాధి బారిన పడగా, ఆ కుటుంబానికి చెందిన మరో 14 మందికి వైరస్ అంటింది. సూర్యాపేటలో 28, నాగారం మండలం వర్ధమానుకోటలో 6, తిరుమలగిరిలో 3, నేరేడుచర్ల, ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరులో ఒక్కో కేసు చొప్పున ఉన్నాయి.

ఇద్దరి వల్ల 38 మందికి

పాత మార్కెట్ ప్రాంతంలో వైరస్ సోకిన వ్యక్తుల ప్రాథమిక కాంటాక్ట్ కలిగిన వ్యక్తులు... 200 మంది ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. వారందర్నీ ఇప్పటికే క్వారంటైన్​కు తరలించగా... నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. అందులో గురువారం 47 మంది ఫలితాలు రాగా... 16 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లా నుంచి 502 నమూనాలు పంపగా... 353 మంది ఫలితాలు వచ్చాయి. ఇంకా 149 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఒకర్ని మినహాయిస్తే మొత్తం 39 మంది బాధితుల్లో... 38 మందికి ఇద్దరు వ్యక్తుల వల్లే వైరస్ సోకింది.

ఈ నెల 2 నుంచి 8 వరకు నల్గొండ జిల్లాలో... 12 కేసులు నమోదయ్యాయి. అందులో నల్గొండలో 9, దామరచర్లలో 2, మిర్యాలగూడ ఒకటి నిర్ధరణయ్యాయి. గత తొమ్మిది రోజులుగా జిల్లాలో ఎలాంటి కేసులు లేకున్నా... అనుమానితులుగా భావిస్తున్న 48 మంది నమూనాల్ని పరీక్షలకు పంపించారు.

కేసులకు తేదీలకు సంబంధం ఇలా

తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ నెల 2న మొదలైన పాజిటివ్ కేసుల పరంపర క్రమంగా కొనసాగుతుండగా... ఆయా తేదీల్లో వెలుగుచూసిన కేసులు అదే అంకెతో కూడిన క్రమంలో వెలువడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో... ఈ అంకెల గారడీ విచిత్రంగా మారింది. ఈ నెల 3న మూడు కేసులు నిర్ధరణ అవగా... అవన్నీ నల్గొండ జిల్లాకు చెందినవే ఉన్నాయి. ఇక 4 వ తేదీన నాలుగు కేసులు తేలగా... ఆ నాలుగూ నల్గొండ పరిధిలోనే నమోదయ్యాయి. ఈ నెల 6న సూర్యాపేట జిల్లాలో ఆరు కేసులు బయటపడ్డాయి. 11 తేదీన వచ్చిన 11 కేసులు సైతం అదే జిల్లావి కాగా... 16న చిత్రంగా 16 మందికి రాగా, వారంతా సూర్యాపేట జిల్లా వాసులే. ఇలా తేదీలకు... ఆ రోజు వెలువడే సంఖ్యలకు సంబంధముందా అన్నట్లుగా సాగుతోంది... ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ తీరు.

ఇదీ చూడండి:

కొడుకు కోసం 6 రాష్ట్రాలు.. 2,700 కి.మీ ప్రయాణించిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.