ETV Bharat / city

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. ఆ జిల్లాల్లోనే అత్యధిక కేసులు - ఏపీ తాజా వార్తలు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి అలజడి రేపుతోంది. కొత్తగా ఒక్కరోజులోనే దాదాపు 2 వేలు కేసులు నమోదుకావడం.. పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కొత్త కేసుల్లో 70శాతానికి పైగా ఐదు జిల్లాల్లోనే ఎక్కువగా బయటపడుతున్నాయి. గుంటూరు, చిత్తూరు, విశాఖ, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ జిల్లాల్లో గత కొన్ని రోజులుగా రోజుకు వందకుపైగా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. ఆయా జిల్లాల్లోని ఆసుపత్రులకు రోగుల తాకిడి అధికమై... కరోనా బ్లాక్‌లను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఏపీలో కరోనా ఉద్ధృతి
corona danger bells in andhrapradesh
author img

By

Published : Apr 7, 2021, 9:13 AM IST

కొవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నందున ప్రభుత్వ ఆస్పత్రుల్లో రద్దీ ఏర్పడుతోంది. విజయవాడలో జీజీహెచ్‌లో 150 పడకలు నిండిపోగా రెండో బ్లాక్‌ను ప్రారంభించారు. గుంటూరులో జీజీహెచ్‌లో దాదాపు 800 పడకలు అందుబాటులో ఉండగా.. 450మందికిపైగా చికిత్స పొందుతున్నారు. నెల్లూరు జీజీహెచ్‌లో పడకలు నిండిపోయే పరిస్థితి ఏర్పడగా... 868 మంచాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ జిల్లాలో నారాయణ ఆస్పత్రిలో మరో 400మంది రోగులకు సేవలందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుపతి స్విమ్స్‌లో 450 పడకలు ఉండగా.. 221మంది రోగులు చికిత్స పొందుతున్నారు. విశాఖ కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో 500వరకు మంచాలు ఉండగా.. 250మంది ఇప్పటికే చేరారు. పడకలు నిండితే విమ్స్‌లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా సెకండ్‌ వేవ్‌లో చాలామంది హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు . వీరికి మందులు అందకపోవడంతో పాటు పరిస్థితి తెలుసుకునేందుకు ఆరోగ్య సిబ్బంది సక్రమంగా రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా కిట్లు అందట్లేదని...పర్యవేక్షణ కరవైందని బాధితులు వాపోతున్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమన్యాలు కరోనా కేసులు నమోదవుతున్నా బహిర్గతం చేయడం లేదు. ఇలాంటి ఘటనలతో తెలియకుండానే కరోనా వైరస్‌ వ్యాప్తి చాపకింద నీరులా విస్తరిస్తోంది. శుభకార్యాలయాలకు వెళ్లే ప్రతి 200 మందిలో 40 మందికి కరోనా వ్యాప్తి చెందుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. జిల్లాలో పెరగుతున్న కేసులను పరిశీలిస్తే ఈ అంశం బయటపడిందని తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడిలో కరోనాతో ఒక్కరోజే ముగ్గురు మృతిచెందారు. గ్రామంలో 15 మందికి పాజిటివ్ గా నిర్ధారణ ఆయింది.

ఇదీ చదవండి

చర్చలకు తామెప్పుడూ సిద్ధమే : మావోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.