నేటి నుంచి ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లోనూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఆస్పత్రుల జాబితాను cowin.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌లో లేకున్నా కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకోవచ్చు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
60 ఏళ్లు దాటినవారు ఏదైనా ధ్రువపత్రం చూపిస్తే చాలని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. 45-59 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్యుని సంతకం ధ్రువపత్రం సమర్పించాలని తెలిపింది. ధ్రువపత్రం లేకున్నా రక్త పరీక్షల నివేదికలు, మందుల చీటీ చూపిస్తే చాలని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఉద్రిక్తంగా మారిన విశాఖ ఉక్కు ఉద్యమం