కృష్ణా జిల్లాలో...
కరోనా మహమ్మారి పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్శన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ సత్యనారాయణ పురంలోని గ్రామ సచివాలయంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గుడివాడ నాగవరప్పాడు బీసీ హాస్టల్లో కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ఆర్డీఓ శ్రీను కుమార్ ప్రారంభించారు. కరోనా వ్యాక్సినేషన్‌పై ఎటువంటి అపోహలు వద్దని ఆయన సూచించారు. 45 సంవత్సరాలు వయసు పైబడిన వారందరూ వాక్సిన్ వేయించుకోవాలన్నారు. జిల్లా ఉప వైద్య శాఖాధికారి డాక్టర్ సుదర్శన్ బాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, డాక్టర్ సతీష్, డాక్టర్ సంఘమిత్ర వైకాపా పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను.. పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో...
కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని నలభై ఐదు ఏళ్ల దాటిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో... కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. కొత్తపేటలో ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ రామలింగం ప్రారంభించారు. కర్నూలులోని 10 సచివాలయాల్లో... వ్యాక్సిన్ వేస్తున్నామని ఆయన తెలిపారు.
గూడూరు నగర పంచాయతీలు గురువారం జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ పరిశీలించారు. 45 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలి ఆయన తెలిపారు. వ్యాక్సిన్ పట్ల అసత్య ప్రచారాలు, అపోహలు విడనాడి కరోనా కట్టడికి సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మొదటి రోజు 1,2,3 వార్డుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తియింది. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసులు, వైద్య సిబ్బంది, కౌన్సిలర్లు ,వైకాపా నేతలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో...
నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారందరూ కరోనా నియంత్రణ వ్యాక్సిన్ వేసుకోవాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. అనంతపురం 48వ వార్డులోని సచివాలయంలో ఎంపీ మాధవ్, కలెక్టర్ గంధం చంద్రుడితో కలిసి కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభించారు. కరోనా మహమ్మారిని అంతమొందించటానికి ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: