ETV Bharat / city

కరోనా విషాదం: రెండురోజుల వ్యవధిలోని తండ్రి, కొడుకు మృతి

కరోనా మహమ్మారి హైదరాబాద్‌లోని ఓ కుటుంబంలో విషాదం నింపింది. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం తండ్రి మృతి చెందగా ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది. శుక్రవారం రెండో కుమారుడు కూడా కొవిడ్‌-19తోనే మృతి చెందాడు. వృద్ధుని భార్య, పెద్దకుమారుడికి సైతం వైరస్‌ సోకడంతో కుటుంబసభ్యులందరూ క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్నారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

COrona tragedy in hyaderabad
హైదరాబాద్ లో కరోనా విషాదం
author img

By

Published : May 2, 2020, 9:47 AM IST

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉండే ఓ వ్యక్తి (48)కి ఇటీవల కరోనా పాజిటివ్‌ రాగా కుటుంబాన్ని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అతను గాంధీలో చికిత్స పొందుతున్నాడు. అతనికి సోదరుడి ద్వారా కరోనా వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఇంతలో ఈనెల29న అతని తండ్రి (76) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందగా.. ఆయనకూ కరోనా సోకినట్లు వైద్యులు తేల్చారు. కుటుంబసభ్యులంతా క్వారంటైన్‌లో ఉండగా.. బల్దియా సిబ్బందే వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా శుక్రవారం సాయంత్రం కుమారుడు మృతి చెందినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.

రెండు రోజుల వ్యవధిలో తండ్రి, కుమారులు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. వృద్ధుడి భార్యకు సైతం కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటికే పెద్ద కుమారుడు గాంధీలో చికిత్స పొందుతుండగా అతని కుటుంబం సైతం క్వారంటైన్‌ కేంద్రంలో ఉంది. కుటుంబంలోని మరో 8 మందికి పరీక్షలు నిర్వహించామని, శనివారం నివేదిక రానుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీరుంటున్న ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి 40 కుటుంబాలను హోం క్వారంటైన్‌ చేశారు.

అమెరికాలో తెలంగాణ వాసి...

అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణ నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి కరోనాతో శుక్రవారం మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 30 ఏళ్ల కిందట న్యూజెర్సీకి వెళ్లిన ఆయన మొదట సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేశారు. తర్వాత వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. వారం కిందట వైరస్‌ బారినపడిన ఆయన న్యూజెర్సీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

ఇదీ చూడండి: స్నేహితుడికి ఉపరాష్ట్రపతి ఫోన్....ఆరోగ్యం పై ఆరా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.