ETV Bharat / city

తెలంగాణ: ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని అజీజ్​నగర్​లో... ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా సోకింది. అప్రమత్తమైన అధికారులు బాధితులందరినీ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా
తెలంగాణలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా
author img

By

Published : Jun 2, 2020, 8:49 PM IST

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్​నగర్​లో.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కరోనా బారినపడ్డారు. టోలీచౌకీకి చెందిన ఓ వ్యక్తి.. వారం క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల కాంటినెంటల్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షలు నిర్వహించగా.. కరోనా సోకినట్టు తేలింది. అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అనంతరం అతని కుటుంబ సభ్యులను కింగ్​ కోఠి ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా.. మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ అని​ తేలింది. వీరందరినీ మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మొయినాబాద్ మండలంలోని ప్రజలను ఎప్పటికప్పుడు కరోనా వ్యాప్తిపై అప్రమతం చేస్తున్నామని ఎమ్మార్వో అనిత పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

'ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికి పాసులు అక్కర్లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.