ETV Bharat / city

వీఆర్డీఎల్ ల్యాబ్​ల ద్వారా కరోనా పరీక్షలు: ఆళ్ల నాని - Alla Nani comments on Corona

వీఆర్డీఎల్ ల్యాబ్​ల ద్వారా కరోనా పరీక్షలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పరీక్షల నిర్వహణకు 533మంది సిబ్బందిని నియమించగా... మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరో 110 మందిని తక్షణమే టెక్నికల్ మెడికల్ సిబ్బందిని నియమిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు.

ఆళ్ల నాని
ఆళ్ల నాని
author img

By

Published : Apr 23, 2021, 4:23 PM IST

రాష్ట్రంలో కరోనా పరీక్షలను పెంచాలని ప్రభుత్వ నిర్ణయించింది. వీఆర్డీఎల్ ల్యాబ్​ల ద్వారా కరోనా పరీక్షలకు అనుమతి ఇచ్చింది. మూడు దశల్లో ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పరీక్షల నిర్వహణకు 533మంది సిబ్బందిని నియామించగా... మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరో 110మందిని తక్షణమే టెక్నికల్ మెడికల్ సిబ్బందిని నియమిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. ప్రతి వీఆర్డీఎల్ కేంద్రంలో కరోనా పరీక్షలు చేయడానికి రీసెర్చర్​తో పాటు రీసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సభార్డినేట్ పోస్తులను భర్తీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రస్తుతం ప్రతిరోజూ 40 వేల వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, కొత్తగా సిబ్బందిని నియమించి రోజుకి 60వేలకు కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఆళ్ల నాని వివరించారు. ట్రూనాట్ యంత్రాల ద్వారా గతంలో రోజుకి 10వేలు పరీక్షలు నిర్వహించామని, మరో మూడు రోజుల్లో ట్రూనాట్ పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ఏలూరు ఆశ్రమం మెడికల్ కాలేజీలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండీ... కరోనా పంజా... అడుగంటుతున్న ఆక్సిజన్ నిల్వలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.