ETV Bharat / city

మళ్లీ కరోనా ప్రమాదఘంటికలు.. నిర్లక్ష్యం వద్దంటున్న వైద్య నిపుణులు

తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. చాపకింద నీరులా పాకుతూ మరోసారి ప్రమాదఘంటికలు మోగిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందటం పరిస్థితికి అద్దంపడుతోంది. అజాగ్రత్త వల్లే కొందరిలో కరోనా వైరస్‌ తీవ్ర రూపు దాలుస్తోందని..,నిర్లక్ష్యం వద్దని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

మళ్లీ కరోనా ప్రమాదఘంటికలు..
మళ్లీ కరోనా ప్రమాదఘంటికలు..
author img

By

Published : Jul 16, 2022, 1:10 PM IST

తెలంగాణ రాజధాని నగరంలో కరోనా మహమ్మారి ‘చాప కింద నీరు’లా పాకుతోంది. మరోసారి ప్రమాదఘంటికలు మోగిస్తోంది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి వస్తున్న కేసులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ ఆసుపత్రి ఐసీయూలో 18 మంది చికిత్స పొందుతున్నారు. గత నాలుగు రోజుల్లో ఇద్దరు మృతిచెందారు. చికిత్స పొందుతున్న వారిలో ఆరేడుగురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. వీరికి నిమిషానికి 50 లీటర్ల వరకు ఆక్సిజన్‌ అందిస్తున్నారు. బాధితుల్లో చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే. ఒక్కరు తప్ప అంతా 50ఏళ్లు దాటినవారే. వీరిలో అసలు వ్యాక్సినే తీసుకోనివారు కొందరుండటం గమనార్హం.

అతి ధీమాతో అనర్థమంటున్న వైద్యులు..

  • అజాగ్రత్త వల్లే కొందరిలో కరోనా వైరస్‌ తీవ్ర రూపు దాలుస్తోంది. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, కేన్సర్‌, క్షయ ఇతర శ్వాసకోశ వ్యాధుల బాధితులతోపాటు 50 ఏళ్లు దాటినవారు జాగత్తగా ఉండాలి.
  • కేసులు పెరగడానికి ఒమిక్రాన్‌ బీఏ4, బీఏ5 వేరియంట్లే అధిక కారణం. ప్రమాదకర డెల్టా వేరియంట్‌ పూర్తిగా కనుమరుగు కాలేదు.
  • కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. నిత్యం 500కు పైగా నమోదవుతుండగా.. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనివే సగానికిపైగా ఉంటున్నాయి. గత వారం రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 2,700 మందికి కరోనా సోకింది.
  • జ్వరం, జలుబు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు ఉంటే తక్షణం నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. 4-5 రోజులు ఐసొలేషన్‌లో ఉండాలి. ఇంట్లో వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధుల బాధితులుంటే మరింత అప్రమత్తత అవసరం.
  • ఈ నెల 15న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారం మేరకు రాష్ట్రంలో కొత్తగా 556 కొవిడ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 8,08,729కి పెరిగింది.
  • బూస్టర్‌ డోసు వేయించుకోవాలి

"కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదు. సమూహాల్లో మాస్క్‌ ధరించటం తప్పనిసరి. ఇప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోనివారు వెంటనే మొదటి డోసు వేయించుకోవాలి. రెండు డోసులు తీసుకొని ఆరునెలలు దాటితే.. బూస్టర్‌ డోసు వేయించుకోవాలి. 12 ఏళ్లు దాటిన పిల్లలకు వ్యాక్సిన్‌ ఇప్పించాలి. ప్రస్తుతం ఎక్కువగా నమోదవుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రమాదకరంగా మారుతోంది." - డా.రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆసుపత్రి

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.