ETV Bharat / city

Omicron cases in Telangana: ఒమిక్రాన్​ ఎఫెక్ట్​... హైదరాబాద్​లో కరోనా ఆంక్షలు - తెలంగాణలో ఒమిక్రాన్​ కేసులు

తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల నమోదుతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్​లోని పారామౌంట్​ కాలనీని కంటైన్మెంట్​ జోన్​గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ కాలనీలో కరోనా ఆంక్షలు విధిస్తూ.. 25 ఇళ్ల పరిధిలో కంటైన్మెంట్​ జోన్​ ఏర్పాటు చేసింది.

Omicron
Omicron
author img

By

Published : Dec 16, 2021, 3:15 PM IST

Omicron cases in Telangana:తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసుల నమోదుతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇటీవల కెన్యా, సోమాలియా దేశాల నుంచి హైదరాబాద్​కు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్​ పాజిటివ్​ నిర్ధరణ కావడంతో.. బాధితులను చికిత్స నిమిత్తం టిమ్స్​ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు హైదరాబాద్​లోని పారామౌంట్​ కాలనీని కంటైన్మెంట్​ జోన్​గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ కాలనీలో కరోనా ఆంక్షలు విధిస్తూ.. 25 ఇళ్ల పరిధిలో కంటైన్మెంట్​ జోన్​ ఏర్పాటు చేసింది.

ఈ నెల 12 న సోమాలియా నుంచి రాజీవ్​ గాంధీ విమానాశ్రయానికి వచ్చిన యువకుడికి జీనోమ్​ సీక్వెన్సింగ్​లో ఒమిక్రాన్​ నిర్ధరణ అయింది. టోలిచౌకికి చెందిన ఆ వ్యక్తి ఆచూకీని పోలీసులు పారామౌంట్​ కాలనీలో గుర్తించారు. వెంటనే బాధితుడిని టిమ్స్​కు తరలించారు. దీంతో ఆ కాలనీలో ప్రభుత్వం కరోనా ఆంక్షలు విధించింది.

ఇదీ చదవండి: 'ఒమిక్రాన్​ వ్యాప్తి 70రెట్లు ఎక్కువ.. కానీ ఆ విషయంలో మాత్రం వీక్!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.