ETV Bharat / city

రాష్ట్రంలో 87 కరోనా పాజిటివ్ కేసులు - corona latest update in ap

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 87కు చేరాయి. ఇవాళ ఒక్కరోజే 43 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యశాఖ బులెటిన్‌ వెల్లడించింది.

corona-latest-update-in-ap
రాష్ట్రంలో 87కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
author img

By

Published : Apr 1, 2020, 11:27 AM IST

Updated : Apr 1, 2020, 11:57 AM IST

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 87కు చేరాయి. ఇవాళ ఒక్కరోజే 43 కరోనా కేసులు నమోదైనట్టు వైద్యశాఖ వెల్లడించింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. నిన్న రాత్రి నుంచి 373 నమూనాలను పరీక్షించగా... 330 మందికి నెగెటివ్, 43 పాజిటివ్ వచ్చినట్టు వైద్యశాఖ బులెటిన్​లో తెలిపింది.

కడప జిల్లాలో 15 మందికి, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మందికి కరోనా సోకింది. చిత్తూరు జిల్లాలో ఇవాళ 5 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం 6కు చేరాయి. ప్రకాశం జిల్లాలో ఇవాళ 4 కరోనా కేసులు నమోదవగా... మొత్తం 15కు చేరాయి. నెల్లూరు జిల్లాలో ఇవాళ 2 కరోనా కేసులు నమోదవగా... మొత్తం కేసులు 3కు చేరాయి. గుంటూరు జిల్లాలో 9 కేసులు, అనంతపురం జిల్లాలో 2, కర్నూలులో ఒక కేసు నమోదు అయ్యాయి.

తూర్పు గోదావరి జిల్లాలో ఇవాళ 2 కరోనా కేసులు నమోదవగా... మొత్తం కేసులు 6కు చేరాయి. విశాఖ జిల్లాలో ఇవాళ 1 కరోనా కేసు నమోదు కాగా.. మొత్తం కేసులు 11కు చేరాయి. కృష్ణా జిల్లాలో ఇవాళ 1 కరోనా కేసు నమోదవగా... మొత్తం 6కు చేరాయి. ఇప్పటివరకు కరోనా నుంచి ఇద్దరు వ్యక్తులు కోలుకున్నారు.

ఇదీ చదవండీ... హైదరాబాద్​లో 'దిల్లీ' కుదుపు.. జమాత్​కు వెళ్లొచ్చిన వారే కారణం

Last Updated : Apr 1, 2020, 11:57 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.