రాష్ట్రంలో వరుసగా 11వ రోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 10,794 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ కాగా... 70 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 4,98,125కి చేరింది. ఇప్పటివరకు 4,417 మంది మృతి చెందారు. కరోనా నుంచి 3,94,019 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 99,689 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 72,573 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం ఇప్పటివరకు 41,07,890 కరోనా పరీక్షలు నిర్వహించారు.
జిల్లాల వారీగా కరోనా మృతులు..
చిత్తూరు జిల్లాలో 9, అనంతపురం జిల్లాలో 8 మంది కరోనాతో మృతి చెందారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున.. కడప జిల్లాలో 7, తూ.గో., విశాఖ, ప.గో. జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనాతో మృతి చెందారు. కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో 2, విజయనగరం జిల్లాలో ఒకరు కరోనాతో మృత్యువాత పడ్డారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు..
నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 1299 కరోనా కేసులు నమోదయ్యాయి. తూ.గో. జిల్లాలో 1244, ప.గో. జిల్లాలో 1101, ప్రకాశం జిల్లాలో 1042, చిత్తూరు జిల్లాలో 927, కడప జిల్లాలో 904, శ్రీకాకుళం జిల్లాలో 818,
అనంతపురం జిల్లాలో 753, గుంటూరు జిల్లాలో 703, విజయనగరం జిల్లాలో 593, విశాఖ జిల్లాలో 573, కృష్ణా జిల్లాలో 457, కర్నూలు జిల్లాలో 380 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి.