రాష్ట్రంలో బియ్యం కార్డుదారులకు మాత్రమే కరోనా సాయం అందనుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ సిద్ధమవుతోంది. రేషన్ సరుకులు అందించేందుకు గతంలో కోటీ 47 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉండగా...వైఎస్ఆర్ నవశకం పేరిట ప్రభుత్వం ఇటీవలే బియ్యం కార్డులను కోటీ 29 లక్షల కుటుంబాలకు పంపిణీ చేసింది. ఇప్పుడు వాటినే ఆర్థిక సాయానికి ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఫలితంగా రాష్ట్రంలో 18 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం అందించే రూ. వెయ్యి సాయం అందకుండా పోనుంది.
రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల వ్యవస్థే నడుస్తుండగా....ప్రభుత్వం వాటిని పక్కనపెట్టి కొత్తగా బియ్యం కార్డులను తీసుకొచ్చింది. వీటి ఆధారంగానే ఈ నెల నుంచి రేషన్ సరుకులు ఇవ్వాలని నిర్ణయించినా....పాత రేషన్‌కార్డుల జాబితా ప్రకారమే కోటీ 40 లక్షల కుటుంబాలకు పంపిణీ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అందించే రూ. వెయ్యి సాయం మాత్రం బియ్యం కార్డుల ఆధారంగా అందించాలని రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి :