ETV Bharat / city

మగ్గాల మాటున నేతన్నల నిట్టూర్పులు - మంగళగిరి నేతన్నల కష్టాలు

మంగళగిరి వస్త్ర మెరుపులు కనిపించడం లేదు. మందగమనంగా కదులుతున్న మగ్గాల మాటున నేతన్నల నిట్టూర్పులు ఎవరికీ వినిపించడం లేదు. సంప్రదాయ వృత్తిని వదులుకోలేక.. వేరే పనికి వెళ్లలేక.... భారంగా బతుకీడుస్తున్న చేనేత కార్మికుల కుటుంబాలపై కరోనా మహమ్మారి కనికరం చూపించలేదు. కొవిడ్ పంజాతో అసలే అంతంతమాత్రంగా ఎదురీదుతున్న చేనేత వస్త్రపరిశ్రమ కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. కరోనా దెబ్బకు కకావికలమైన గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత వస్త్రపరిశ్రమపై ప్రత్యేక కథనం.

mangalagiri handloom weavers
mangalagiri handloom weavers
author img

By

Published : Oct 7, 2020, 9:42 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి చేనేతన్నకు ఘనమైన చరిత్రే ఉంది. నాణ్యమైన, అందమైన వస్త్రాలకు మంగళగిరి పెట్టింది పేరు. ముచ్చటగొలిపే చేతి నేత.... మైమరిపించే డిజైన్లు... అంచుల మెరుపులు... బుటాల తళుకులు... మంగళగిరి వస్త్రసోయగాల ప్రత్యేకతను చాటుతాయి. చేతినేతతో జాలువారే వివిధ వస్త్రశ్రేణులు అన్నితరాల వారిని ఆకర్షిస్తాయి.

కాలానుగుణ పరిస్థితులకు అనుగుణంగా మిగతా రంగాల మాదిరిగానే చేనేత పరిశ్రమ పూర్తిస్థాయి నవీకరణకు నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సాంకేతికత ఫరిడవిల్లుతున్న అధునాతన కాలంలోనూ సంప్రదాయ మగ్గాలపైనే కార్మికులు పనిచేస్తూ జీవితాలను నెట్టుకొస్తున్నారు. అత్తెసరు సంపాదనతో.. అర్థాకలితో ఎదురీదుతున్న బడుగు జీవులపై కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బతీసింది.

పని కరవైంది...

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ తో రెండు, మూడు నెలలపాటు పూర్తిస్థాయిలో వస్త్ర పరిశ్రమ స్తంభించిపోగా... తర్వాత కూడా మూడోవంతు మగ్గాలే నడుస్తున్నాయి. లాక్ డౌన్ వెళ్లి అన్ లాక్ వచ్చినా ప్రజలు వస్త్రాల కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ప్రజల్లో కరోనా వ్యాప్తి భయంతోపాటు దిగజారిన ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణమే. ఫలితంగా.... నేతన్న కుటుంబాలకు పని కరువైంది.

మంగళగిరిలో 2వేల500 వరకు మగ్గాలుండగా.... అద్దకం, ఆసులు తోడటం, అచ్చులు అతికించడం, సైజులు తీయడం వంటి అనుబంధరంగాలకు చెందిన కార్మికులతో కలుపుకుంటే మొత్తం చేనేత కార్మికులు 8వేల నుంచి 9వేల మంది వరకు ఉంటారు. వీరందరికీ ఇప్పుడు ఉపాధి గగనంగా మారింది.

సగం కూడా ఉత్పత్తి లేదు....

గతంలో నెలకు 8వేల నుంచి 10వేల రూపాయల వరకు ఆదాయం రాగా... కరోనాతో సరకు నిలిచి.... మగ్గాలు ఆగి... వారి ఉపాధికి గండిపడింది. గతంలో నెలకు నాలుగు బార్లు అంటే 16 చీరలు నేయగా... ఇప్పుడు సగం చీరల ఉత్పత్తికీ అవకాశం లేత ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వారి ఆదాయం నెలకు 2వేల నుంచి 4వేలకు మించడం లేదు. ఇంటి అద్దెలు కట్టాలో... ఆకలి తీర్చుకోవాలో తెలియక కార్మికులు విలవిల్లాడుతున్నారు. మిగతా రంగాల్లో కుటుంబ సభ్యులు వేర్వేరు పనులకు వెళ్తారు. చేనేత రంగంలో మాత్రం కుటుంబమంతా దీనిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి.

సంప్రదాయ వృత్తిని వదల్లేక.....వచ్చే నాలుగు రూకలతోనే కుటుంబాన్ని ఈదాల్సిన దయనీయస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లల్ని ఇటువైపు రానీయకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ నేతన్ననేస్తం నిబంధనల కారణంగా కొందరికే పరిమితమైంది. సొంతింట్లో మగ్గముంటే తప్ప ఫించన్ ఇవ్వబోమన్న ప్రభుత్వ నిబంధన కారణంగా చాలామంది చేనేత కార్మికులకు ఈ అవకాశం దక్కలేదు. ఇప్పటికైనా తమ గోడును ప్రభుత్వం పట్టించుకోవాలని... చేనేత కార్మికులందరికీ పింఛన్లు అందించాలని వేడుకుంటున్నారు.

30 కోట్లకు పడిపోయిన టర్నోవర్...

మంగళగిరి వస్త్ర పరిశ్రమ వార్షిక టర్నోవరు 100 నుంచి 120 కోట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆ మొత్తం 30 నుంచి 40 కోట్లకు పడిపోయింది. కొవిడ్ కు ముందు వచ్చే వినియోగదారుల్లో ఐదో వంతు మాత్రమే ఇప్పుడు వస్తున్నారని.. పూర్తిగా భయం పోలేదని చెబుతున్నారు అమ్మకదార్లు. సొసైటీల పనితీరు నామమాత్రంగా మారగా.. వస్త్రపరిశ్రమ 80 శాతం మాస్టర్ వీవర్లపైనే ఆధారపడి కొనసాగుతోంది. వీరే సాధారణ కార్మికులకు మగ్గాల ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. కొవిడ్ కారణంగా జైపూర్, కోల్ కత్తా, బెంగళూరు, దిల్లీ వంటి ప్రాంతాలకు వస్త్రాల రవాణా నిలిచిపోయింది. ఇలా మంగళగిరి పరిధిలో 35 నుంచి 40 కోట్ల వరకు సరకు నిలిచిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులను, చేనేత వస్త్ర రంగాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలే ఆదుకోవాలని ఆ వర్గాల నుంచి విన్పిస్తున్న నివేదన. ముడి నూలును జీఎస్టీ పరిధిలోకి చేర్చి 5.2 శాతం పన్నును వసూలు చేస్తుండటంతో వ్యాపారులు అల్లాడుతున్నారు. జీఎస్టీ నుంచి చేనేతరంగాన్ని మినహాయించాలని ఎప్పటి నుంచో నివేదిస్తున్నా ఫలితం ఉండటం లేదని వాపోతున్నారు. మరోవైపు పేరుకుపోయిన నిల్వలను రాష్ట్రప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు చేస్తేనే చేనేత వస్త్ర పరిశ్రమ బతికిపట్టకట్టే అవకాశముందని మాస్టర్ వీవర్లు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

వైఎస్​ఆర్ చేయూత, ఆసరాలో ఎక్కడా లోపం రావొద్దు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.