ETV Bharat / city

corona effect on granite: గ్రానైట్​పై కరోనా బండ.. కోలుకోని పరిశ్రమలు - ఏపీ వార్తలు

కొవిడ్‌ ప్రభావం నుంచి గ్రానైట్‌ పరిశ్రమ తేరుకోలేదు. డిమాండ్‌ లేక చైనాకు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఓషియన్, ఫ్రైట్‌ ఛార్జీలతో పాటు ప్రభుత్వం పెంచిన పన్నులు లీజుదారులకు గుదిబండగా మారాయి.

corona effect on granite
corona effect on granite
author img

By

Published : Dec 20, 2021, 7:41 AM IST

Updated : Dec 20, 2021, 12:40 PM IST

గ్రానైట్​పై కరోనా బండ.

రాష్ట్ర గ్రానైట్‌ పరిశ్రమ కరోనా ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదు. రెండేళ్లుగా బయ్యర్లు ముడిరాయిని తీసుకోవడం తగ్గించేశారు. ఇది లీజుదారులపై ప్రభావం చూపిస్తోంది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభించే గెలాక్సీ రకం గ్రానైట్‌తో పాటు...చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో లభించే మరిన్ని రకాల లీజుల నుంచి విదేశాలకు ముడిరాయి ఎగుమతులు చాలావరకు తగ్గిపోయాయి. గ్రానైట్‌ రాయి ఎక్కువగా చైనాకు ఎగుమతి అవుతుండగా.. ప్రస్తుతం డిమాండ్‌ లేదంటూ ఆ దేశపు బయ్యర్లు తీసుకోవడం మానేశారు. దీనికి తోడు వివిధ రకాల రుసుములు పెరగడం, రాష్ట్ర ప్రభుత్వం లీజుదారులపై వివిధ రూపాల్లో అదనపు భారాలు వేయడంతో...గ్రానైట్‌ పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

గతంలో చీమకుర్తి నుంచి ఎక్కువగా గెలాక్సీ రకం గ్రానైట్‌ చైనాకు ఎగుమతయ్యేది. అక్కడి బయ్యర్లు ముడిరాయిని తీసుకెళ్లి కటింగ్, పాలిషింగ్‌ చేసి....సరకులో సగం దాకా ఆ దేశంలోనే సరఫరా చేసే వారు. మిగిలినదాన్ని విదేశాలకు ...ముఖ్యంగా ఐరోపాకు పంపించే వారు. ప్రస్తుతం ఆయా దేశాల్లో నిర్మాణ రంగం నెమ్మదించడంతో గ్రానైట్‌కు డిమాండ్‌ తగ్గింది. మరోవైపు చైనాలో విద్యుత్‌ కోతలతో అక్కడి జియామిన్‌ పోర్టుకు సమీపంలో ఎక్కువగా ఉండే గ్రానైట్‌ కటింగ్, పాలిషింగ్‌ యూనిట్లు మూతపడ్డాయి. కొవిడ్‌కు ముందు చీమకుర్తిలో లభించే గెలాక్సీ గ్రానైట్‌ ముడిరాయి గతంలో నెలకు 4 వెసల్స్‌ చైనాకు వెళ్లేవి. ఒక్కో వెసల్‌లో 60 వేల టన్నులు చొప్పున... నెలకు 2లక్షల 40 వేల టన్నులు ఎగుమతి అయ్యేది. ఇప్పుడు డిమాండ్‌ లేకపోవడం వల్ల ….నెలకు ఒక వెసల్ అతి కష్టంమీద వెళ్తోంది. ఈ పరిస్థితుల్లో చైనా బయ్యర్ల షరతులన్నింటికీ లీజుదారులు అంగీకరించాల్సి వస్తోంది.

ఇటీవల కాలంలో లీజుదారులపై భారాలు మరింత పెరిగాయి. ప్రకాశం జిల్లా లీజుదారులు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు నుంచి ముడిరాయిని ఎగుమతి చేసేవారు. అయిదారు నెలలుగా ఆ పోర్టులో వీటిని అనుమతించడం లేదు. గతంలో తరలించిన ముడిరాయి నిల్వలు పేరుకు పోవడం వల్ల స్థలం లేదని చెబుతున్నారు. ఆ పోర్టు నుంచి కంటైనర్ల లోడింగ్‌కే అనుమతించేలా నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల గ్రానైట్‌ ముడిరాయిని తమిళనాడులో కట్టుపల్లి పోర్టు నుంచి ఎగుమతి చేయాల్సి వస్తోంది. ఫలితంగా రవాణా ఛార్జీలు టన్నుకు అదనంగా 2 వేల నుంచి 3 వేల వరకు పెరిగాయి. పోర్టులో ఓషియన్‌ ఛార్జ్‌ గతంలో టన్నుకు 10 డాలర్లు ఉండగా... 4 నెలల కిందట దీన్ని 35 డాలర్లకు పెంచారు. ఇటీవల గనులశాఖ రాబడి పెంచుకునేందుకు ప్రభుత్వం పలు రూపాల్లో లీజుదారులపై భారం వేసింది. ముఖ్యంగా సీనరేజీ ఫీజుకు తోడు... అదనంగా 50 శాతం కన్సిడరేషన్‌ నగదు చెల్లించాలనే నిబంధన తెచ్చింది. అంటే గతంలో గెలాక్సీ గ్రానైట్‌కు టన్నుకు 14 వందల 15 రూపాయల సీనరేజీ ఫీజు ఉండగా.... దీనికి కన్సిడరేషన్‌ నగదు కింద 708 కలిపి ప్రస్తుతం 2వేల 123 చెల్లించాల్సి వస్తోంది. లీజుదారులు సెక్యూరిటీ డిపాజిట్‌ కింద అడ్వాన్స్‌ వార్షిక డెడ్‌రెంట్‌ విలువకు అయిదు రెట్లు చెల్లించాలనే నిబంధనా లీజుదారులకు భారమైంది. ఇప్పటి వరకు గ్రానైట్‌కు వార్షిక డెడ్‌రెంట్‌ హెక్టారుకు లక్షా 30 వేలు ఉండగా ...ఇపుడు 6లక్షలా 50 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇన్ని సవాళ్ల మధ్య గ్రానైట్‌ ఎగుమతులు చేయడం కష్టంగా ఉందని లీజుదారులు వాపోతున్నారు.

ఇదీ చదవండి: CWC Visit Sileru Complex: సీలేరు జలాశయాలను పరిశీలించిన.. కేంద్ర నీటి కమిషన్

Last Updated : Dec 20, 2021, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.