గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 117 మందికి కరోనా సోకినట్టుగా వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,87,466కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 7,152 మంది మృతి చెందారు. కరోనా నుంచి తాజాగా మరో 128 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 8.78 లక్షల మందికి పైగా బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 36,189 కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షలు కోటీ 30 లక్షలు దాటాయి.
ఇదీ చదవండి: ఎస్‌ఈసీ ప్రొసీడింగ్స్ వెనక్కి పంపాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ