రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 9,536 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,67,123కి చేరింది. గడిచిన 24 గంటల్లో మహమ్మారితో 66 మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,912 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు ఈ వైరస్ నుంచి 4,67,139 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 95,072 మంది కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు.
జిల్లాల వారీగా కరోనా మృతులు..
గడిచిన 24 గంటల్లో అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు చొప్పున కరోనాతో మృతి చెందారు. కడప, విశాఖ జిల్లాల్లో ఆరుగురు చొప్పున..చిత్తూరు, తూ.గో., కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున చనిపోయారు. గుంటూరు, విజయనగరం జిల్లాల్లో నలుగురు చొప్పున,.. ప.గో. జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు ఈ మహమ్మారికి బలి అయ్యారు. కరోనాతో మృతి
జిల్లాల వారీగా కరోనా కేసులు
అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ముందు స్థానంలో కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 1414 కరోనా కేసులు ఈ జిల్లాలోనే నమోదయ్యాయి. ప.గో. జిల్లాలో 1076, చిత్తూరు జిల్లాలో 957, నెల్లూరు జిల్లాలో 844, గుంటూరు జిల్లాలో 792, ప్రకాశం జిల్లాలో 788, శ్రీకాకుళం జిల్లాలో 733, కడప జిల్లాలో 585, విజయనగరం జిల్లాలో 573, అనంతపురం జిల్లాలో 521కేసులు, కర్నూలు జిల్లాలో 441, విశాఖ జిల్లాలో 415, కృష్ణా జిల్లాలో 397 కరోనా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 72,233 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం నిర్వహించిన పరీక్షల సంఖ్య 45,99,826కి చేరింది.