ETV Bharat / city

కరోనా విజృంభన.. 24 గంటల వ్యవధిలో 56 మంది బలి - corona death toll in ap

కరోనా ఉద్ధృతితో రాష్ట్రంలో కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా కరోనా కేసులు ఒక్కరోజులోనే 5వేలు దాటాయి. వైరస్‌ మహమ్మారి ధాటికి 56 మంది ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఉద్యోగులు వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఒక్క తిరుపతిలోనే కేసుల సంఖ్య 2వేలు దాటింది.

corona cases
corona cases
author img

By

Published : Jul 20, 2020, 3:12 AM IST

రాష్ట్రంలో ఒక్క రోజులోనే ఏకంగా 5 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 జిల్లాల్లో 6 వందలకు పైగా బాధితులను గుర్తించారు. 31వేల 148 నమూనాలు పరీక్షించగా.. 5వేల 41 మంది పాజిటివ్‌గా తేలారు. మరోవైపు... 1106 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 49 వేల 650కి చేరింది. కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 647, అనంతపురం 637, శ్రీకాకుళం 535, చిత్తూరులో 440 కేసులు నమోదయ్యాయి. కృష్ణా 397 , పశ్చిమ గోదావరి 393, నెల్లూరు 391, కర్నూలు 364, గుంటూరు 354, విశాఖ 266, విజయనగరం 241, కడప 226, ప్రకాశం 150 మంది చొప్పున వైరస్‌ సోకింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 642కు పెరిగింది.

గుంటూరు జిల్లాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ముగ్గురు వైరస్ బారిన పడ్డారు. నరసరావు పేట పంచాయతీ రాజ్‌ శాఖ కార్యాలయంలో పనిచేసే ఫిరంగిపురానికి చెందిన వ్యక్తితో పాటు పాటు ఆయన భార్య, కుమారుడికీ వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది. ఫిరంగిపురంలో ఒక్క రోజులోనే 6 కేసులు నమోదయ్యాయి. మేడికొండూరు మండలం కొర్రపాడులో సచివాలయంలో పనిచేసే మహిళ కరోనా బారిన పడింది. మొత్తంమీద మేడికొండూరు లో ఆదివారం ముగ్గురికు కరోనా నిర్ధారణ అయింది. సత్తెనపల్లిలో వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. సత్తెనపల్లి, బాపట్లలో కొవిడ్‌తో ఇద్దరు మృతి చెందారు. గుంటూరు నగరం సహా సత్తెనపల్లి, నరసరావుపేట, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేవలం 5 రోజుల్లోనే 2వేల9 కేసులు నమోదు కావడం స్థానికుల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. పిడుగురాళ్ళలో వాసవి నగర్ రెడ్ జోన్ ప్రాంతంలో అధికారులు ఏర్పాటు చేసిన కంచెను పక్కకు జరిపి స్థానికులు ఇష్టానుసారంగా రాకపోకలు సాగించడం కలకలం రేపుతోంది. ఆ ప్రాంతంలో ఆశా వర్కర్లు, వాలంటీర్లు, పోలీసులు సరిగా విధులకు రావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చిత్తూరు జిల్లాలో ఆదివారం రికార్డు స్థాయిలో 440 కేసులు నమోదయ్యాయి. ఒక‌్క తిరుపతి నగరంలోనే 2వేల కేసులు నమోదు కావటం భయాందోళనలు రేపుతోంది. ఈ పరిస్థితుల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాల నిర్వహణకు నగరపాలక సంస్థ కమిషనర్ అనుమతించారు. తిరుమల అర్చకులు, కైంకర్య పర్యవేక్షకులకు కరోనా సోకినందున, శ్రీవారి దర్శనాలు నిలిపేయాలనే అంశంపై అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

తిరుపతిలో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నామని తుడా ఛైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి ఫైవ్ స్టార్ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. తిరుపతిలో కరోనా కాటుకు హోం గార్డ్ మృతి చెందడం కలకలం రేపింది. అలిపిరి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేసే సుబ్రహ్మణ్యం రెడ్డి స్థానిక ఆస్పత్రిలో కొవిడ్‌ సెల్‌లో విధులు నిర్వర్తించే వారు. కరోనా సోకిన ఆయన ప్రాణాలు కోల్పోయారు.

విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజక వర్గంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. చీడికాడ మండలంలో ఆరుగురికి కరోనా సోకిందని తహసీల్దార్ వెల్లడించారు. జి. కొత్తపల్లి 4, దిబ్బపాలెం, చెట్టుపల్లిలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. దేవరాపల్లి మండలంలో దేవరాపల్లి, తిమిరాం, కొత్తపెంట గ్రామాల్లో ఒక్కొక్కటి బయటపడ్డాయి. కె. కోటపాడు మండలంలోని సంతపాలెంలో ఒక కరోనా కేసు నమోదైందని అధికారులు తెలిపారు. పాజిటివ్‌గా తేలిన వారిని విశాఖపట్నం తరలించారు.

కరోనా లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తి... కాసేపటికే ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకొంది. బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట గ్రామానికి చెందిన వ్యక్తిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం బంధువులు తీసుకొచ్చారు. అయితే తగిన సదుపాయాల్లేక అనంతపురం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. రెవెన్యూ అధికారుల ద్వారా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.

కడప జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం మూతపడింది. ఆలయ పూజారి ఒకరికి కరోనా నిర్ధారణ అయినందున ఈనెల 27 వరకు దర్శనాలు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి:

''కోర్టులు 'అవసరం' అయినప్పుడే జోక్యం చేసుకుంటాయి''

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.