ETV Bharat / city

కొవిడ్​తో వణుకుతున్న తెలంగాణ గిరిజన ప్రాంతాలు - టెస్టులు తగ్గిస్తున్నారు

చుట్టూ గుట్టలు.. చెట్లూపుట్టలూ..  దట్టమైన అడవులకు నెలవులు.. జీవ వైవిధ్యానికి నిలయాలు.. బాహ్య ప్రపంచానికి దూరంగా నివాసాలు.. అలాంటి మారుమూల గిరిజన ప్రాంతాల్లోనూ కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ బతుకులను ఆగం చేస్తోంది.

corona cases increasing at tribal areas in telengana
కొవిడ్​తో వణికిపోతున్న గిరిజన ప్రాంతాలు
author img

By

Published : May 24, 2021, 10:23 AM IST

మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలతో ఏటా మంచం పట్టే గిరిజన ప్రాంతాలు కొవిడ్‌తో వణికిపోతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు ఇరవై నుంచి నలభై పరీక్షలే చేస్తుండటంతో.. వైరస్‌ ఉందో లేదో తెలియక గిరిజనులు తల్లడిల్లుతున్నారు. పౌష్టికాహారం లేక ఇబ్బందిపడుతున్నారు. తెలంగాణ భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని పల్లెల్లోనైతే పాజిటివ్‌ వచ్చిన కుటుంబాలను ఇతరులు పూర్తిగా దూరం పెడుతున్నారు. 14 రోజులు గడిచేవరకు ఇంట్లో ఉన్నది తింటూ మగ్గిపోతున్నారు. జ్వరపీడితులున్న గ్రామాల్లో నిత్యావసరాలు పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు. ఇక్కడ జ్వర తీవ్రత కొలిచే థర్మామీటర్లే లేకపోవడం గమనార్హం. కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది.

20 పరీక్షలే చేస్తారట

గిరిజనుడు

మా గ్రామంలో ప్రతి ఇంట్లోనూ జ్వరాలు ఉన్నాయి. రవాణా సౌకర్యాలు లేవు. 16 కిలోమీటర్ల దూరంలోని గుండాల పీహెచ్‌సీకి వెళ్తే రోజుకు ఇరవై మందికే పరీక్షలు చేస్తామంటున్నారు. వృద్ధులు, బలహీనుల పరిస్థితి ఏంటి? ఐటీడీఏ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఆదివాసీలను కాపాడండి సారూ. -కొర్సం లాలయ్య, గిరిజనుడు, శంభునిగూడెం

ఏకైక పీహెచ్‌సీ.. వైద్యుడికి కరోనా

భద్రాద్రి, ములుగు జిల్లాల్లోని 40 గిరిజన గూడేలకు గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే దిక్కు. ఈ ఆసుపత్రికి 35 కిలోమీటర్ల నుంచీ గిరిజనులు కాలినడకన వైద్యానికి వస్తున్నారు. ఖమ్మానికి 100, కొత్తగూడెంకు 110 కి.మీ. దూరంలోని ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులుండగా ఒకరిని ఆరు నెలల క్రితం మరో మండలానికి పంపారు. ఇక్కడ ఉన్న ఒక్క వైద్యుడికి ఇటీవల కరోనా వచ్చింది. అయినా సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. తాజాగా ఆదివారం మరో వైద్యుడు రావడం కాస్త ఊరట. ఇక్కడ గతంలో రోజూ 40 పరీక్షలు చేయగా.. ప్రస్తుతం 20 మాత్రమే నిర్వహిస్తున్నారు. ‘‘రెండుసార్లు పూర్తయిన ఫీవర్‌ సర్వేలో 150 జ్వరాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 50 మంది కరోనా బాధితులు ఉన్నారు. మరో వైద్యుడిని పంపిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు’’ అని వైద్యుడు రవిచంద్‌ పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని కొన్ని గిరిజన గ్రామాల్లో ఇటీవల 40 కేసుల వరకు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ దృష్టి పెట్టడంతో ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో 5-10 కేసులు మాత్రం నమోదవుతున్నాయని డీఎంహెచ్‌వో అప్పయ్య తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల, మహాముత్తారం మండలాల్లోని గిరిజన గూడేల్లోనూ బాధితులున్నారు.

ఇదీ చూడండి:

కొవిడ్ ఆస్పత్రులను సందర్శించకుండా.. తెదేపా నేతల గృహ నిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.