ETV Bharat / city

ఉగ్రరూపం దాలుస్తున్న మహమ్మారి.. జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్యులు

author img

By

Published : Apr 14, 2021, 12:58 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. గత 13 రోజుల్లో అన్ని జిల్లాల్లోనూ కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ నియంత్రణ మార్గదర్శకాలను పాటించకపోవటంతో.. కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే ఈ నెలాఖరు నాటికి క్రియాశీల కేసులు సంఖ్య లక్ష దాటుతాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

corona cases increased
పెరుగుతున్న కరోనా కేసులు

గతేడాది ఇదే సమయంలో నమోదైన కరోనా కేసులు గణంకాలు చూస్తే.. రెండో దశలో నమోదవుతున్న కేసుల సంఖ్య బంబేలెత్తిస్తోంది. గత మార్చిలో 97, ఏప్రిల్ మొత్తంగా 1,366 చొప్పున కేసులు నమోదయ్యాయి. అప్పట్లో ఉన్న ఆంక్షలు ప్రస్తుతం ఏమీ లేనందున వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఈ ఏడాది మార్చిలో 13,286 కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో 13 రోజుల్లో 30,903 కేసులు నమోదవటం వైరస్ వ్యాప్తి తీవ్రతను తెలియజేస్తోంది.

విశాఖలో విజృంభిస్తోన్న కరోనా..

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సత్యనారాయణపురంలో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఆ ప్రాంతంలో వైద్య శిబిరం నిర్వహించి 55 మందికి కరోనా పరీక్షలు చేశారు. అందులో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. మూలపేట ప్రాంతాల్లో జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచించారు.

గుంటూరులో పెరుగుతున్న కొవిడ్ తీవ్రత..

గుంటూరు నగరంలో కరోన వైరస్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుందని.. దీన్ని పూర్తి స్థాయిలో నియంత్రించడానికి కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటించటంతో పాటు నగరంలో 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని నగర కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. సచివాలయాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామని.. ఎలాంటి అపోహలకు లోను కాకుండా.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ చేయించుకోవాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కరోనా మహమ్మారి పై విజయం సాధించాలని ఆకాంక్షించారు.

శ్రీకాకుళం జిల్లాకు కొవిడ్ టీకా..

శ్రీకాకుళం జిల్లాకు కొవిడ్ టీకా చేరుకుంది. కేంద్రం ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి దిగుమతి అయిన వెంటనే అధికారులు సిక్కోలుకు తరలించారు. జిల్లాకు 40 వేల డోసుల కొవిషీల్డ్ టీకా చేరిందని అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బగాది జగన్నాధరావు తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యంలో.. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ అమిత్ బర్దార్ పేర్కొన్నారు. ఏడు రోడ్ల కూడలిలో కొవిడ్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.

ఇవీ చూడండి:

'ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.