ETV Bharat / city

రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి... కొత్తగా 73 కేసులు - ఏపీ కొవిడ్ కేసులు

corona-breaking
రాష్ట్రంలో కొత్తగా 73 కరోనా కేసులు
author img

By

Published : Apr 29, 2020, 10:54 AM IST

Updated : Apr 30, 2020, 6:44 AM IST

09:28 April 29

కొవిడ్ కేసులు

undefined

రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మూడు జిల్లాల్లోనే మరోసారి ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో పెద్ద సంఖ్యలో బయటపడుతున్న కేసులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి 73 కేసులు తేలగా మొత్తం కేసుల సంఖ్య 1332కి చేరింది. విజయనగరం, నెల్లూరు మినహా అన్ని జిల్లాల్లోనూ కొత్త కేసులు నమోదయ్యాయి. 7727నమూనాలు పరీక్షించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇంకా అదే ఒరవడి కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో బుధవారం 29 మందికి, కృష్ణాలో 13, కర్నూలులో 11మందికి వైరస్‌ సోకింది. మొత్తం మీద కర్నూలులో ఇప్పటికే 300 కేసులు దాటిపోగా గుంటూరు అదే బాటలో ఉంది. కృష్ణాలో 200 దాటాయి.

గుంటూరు జిల్లాలో

గుంటూరు జిల్లాలో మరో 29 మందికి వైరస్‌ సోకింది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 283కి పెరిగింది. 26 కేసులు ఒక్క నరసరావుపేట నుంచే నమోదు కావడం ఆందోళన రేపుతోంది. వరవకట్ట, రామిరెడ్డిపేట, అరండేల్ పేట, పెద్దచెరువు, ఏనుగు బజార్, పాతూరు ప్రాంతాల్లో వైరస్ విజృంభిస్తోంది. కేసుల తీవ్రతతో నరసరావుపేట పూర్తిస్థాయి లాక్ డౌన్‌లోకి వెళ్లింది.  మిగిలిన 3 కేసుల్లో గుంటూరు అర్బన్ పరిధిలో 2, సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో ఒకటి నమోదయ్యాయి. గుంటూరు అర్బన్‌లో కేసుల సంఖ్యలో క్రమంగా తగ్గుదల కన్పిస్తుండగా.. గ్రామీణంలో మాత్రం బాధితులు పెరుగుతున్నారు. కరోనా తీవ్రతతో నరసరావుపేటలో పర్యటించిన గ్రామీణ ఎస్పీ విజయరావు సిబ్బందికి సూచనలు చేశారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న వరవకట్ట, రామిరెడ్డిపేట ప్రాంతాల్లో బందోబస్తును పర్యవేక్షించారు.

కృష్ణా జిల్లాలో

కృష్ణా జిల్లాలో నమోదైన 236 కేసుల్లో..దాదాపు  200 మందిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ వారందరికీ వైరస్‌ సోకిందని వివరించారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావుతో కలిసి కార్మిక నగర్, కుద్దూస్ నగర్, మాచవరం ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. కరోనా బారిన పడకుండా సురక్షితంగా ఉండాలంటే ఇంట్లో ఉండటమే మార్గమని పేర్కొన్నారు.  కృష్ణాజిల్లా  నూజివీడులో మరో కరోనా కేసు రాగా 48 గంటల పాటు పట్టణం మొత్తం  రెడ్ జోన్‌గా ప్రకటించారు. ప్రజలు రెండు రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

కర్నూలు జిల్లాలో

కర్నూలు జిల్లాలో మరో 11 మందికి కరోనా సోకిందని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 343 కు పెరిగింది. చిత్తూరు జిల్లాలో మరో 3 కేసులతో మొత్తం సంఖ్య 77కి చేరింది. మూడూ శ్రీకాళహస్తిలోనే గుర్తించారు. ప్రకాశం జిల్లాలో మరో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ జిల్లాకు చెందిన 60 మందికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు. వీరందరికీ ఒంగోలు కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో 4278 మంది నమూనాలకు సంబంధించి నివేదికలు రావాల్సి ఉంది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలాన్ని రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కు మార్చుతున్నట్లు ప్రకటించారు. తొలి కేసు నమోదై  28 రోజులు పూర్తైనందున ఈ మేరకు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు.  

ఇదీ చదవండి :  'పేదల నోటి కాడి కూడు లాగేస్తున్నారు...'

Last Updated : Apr 30, 2020, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.